ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుపై బీజేపీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేయనుంది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కేకే ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. ఇది అక్రమమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో విస్త•తంగా ప్రచారం చేయాలని భావిస్తున్న బీజేపీ ఇందులో భాగంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం మున్సిపల్ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పిస్తున్నది.
టీఆర్‌ఎస్ ఎంపి కేకే ఏపీ నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారనీ, ఈమేరకు ఆయన ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైనట్లు 2014 మే 30న అధికారికంగా ప్రకటించారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలో మొత్తం 15 స్థానాలకు గాను బీజేపీ 9 స్థానాలలో విజయం సాధించింది. టీఆర్‌ఎస్ కేవలం ఐదింటిలో గెలుపొందింది. అయితే, టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని చేజిక్కించున్నదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందున టీఆర్‌ఎస్ ఎంపి కేకేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్‌నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శనివారం వినతిపత్రం అందించనుంది.
Tags: Ts BJP President, K laskhman, meets Venkaiah Naidu, delhi, k kesavarao