కొరోనా వైరస్ విస్తరణ కారణంగా ఈ నెల 26 న నిర్వహించవలసిన రాజ్య సభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది .17 రాష్ట్రాలలో 55 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫిబ్రవరి 2 న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఇందులో 10 రాష్ట్రాల నుంచి 37 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 స్థానాలకు ఈనెల 26 న ఎన్నికలు జరగవలసి ఉంది.
కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కొరోనా వైరస్ నియంత్రణ కు తీసుకోవలసిన జాగ్రత్తల సూచనల మేరకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది .రిప్రెసెంటేషన్ అఫ్ ప్యూపిల్ స్ ఆక్ట్ 1951 ,సెక్షన్ 153 ద్వారా సంక్రమించిన అధికారం ప్రకారం ఎన్నికలను వాయిదా వేస్తున్నామని , మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో విడుదల చేసే ప్రకటనలో తెలియజేస్తామన్నారు.