Take a fresh look at your lifestyle.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజీవ్‌

మందమర్రి, మే 21, ప్రజాతంత్ర విలేఖరి : బలహీనవర్గాల బాంధవుడుగా బడుగులకు అండగా నిలిచిన నేత భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని, అనగారిన వర్గాల అభివృద్ధి కోసం అనేక పథకాలనుచేపట్టిన మహోన్నత వ్యక్తి రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ప ఆర్టీ సీనియర్‌ ‌నాయకులు సోత్కు సుదర్శన్‌, ‌మందమర్రి మున్సిపల్‌ ఇం‌చార్జీ నోముల ఉపేందర్‌ ‌గౌడ్‌ ‌పేర్కోన్నారు. గురువారం మాజీ భారత ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌ ‌గాంధీ 29వ వర్తంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఉపేందర్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన పథకాలు బడుగు, బలహీన వర్గాలకు బలం చేకూర్చాయాని, రాజీవ్‌ ‌గాంధీ తన స్వలాభం కోసం కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పని చేశారని ఆయన తెలిపారు. గాంధీ వంశంలో మచ్చలేని నేతగా సూపర్‌ ‌సుపరిపాలన అందించారని, అది గిట్టని కొన్ని శక్తులు అతన్ని మట్టుపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌ ‌గాంధీ కలలు కన్న స్వరాజ్యం రావాలంటే కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. నేడు దేశంలో నియంత పాలన కొనసాగుతుందని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి  పతనం తప్పదని వారు జోస్యం చేప్పాఉ. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ‌నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సునార్కార్‌ ‌రాంబాబు, పట్టణ ఉపాధ్యక్షుడు ఎం.డి.జమిల్‌, ‌ప్రధాన కార్యదర్శి సకినాల శంకర్‌, ఐఎన్‌టిసి సెంట్రల్‌ ఆర్గనైజర్‌ ‌పుల్లూరు లక్ష్మణ్‌, ‌మండల కాంగ్రెస్‌ ‌నాయకులు కడారి జీవన్‌ ‌కుమార్‌, ‌పిండి ఐలయ్య, మన్యం రాజు ఎం.డి.సలీం, ఎం.డి. ఆఫీస్‌, ‌కనకరాజు, ఓదేలు ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌జగన్‌, ‌నిఖిల్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తిలో…
image.png

వనపర్తి  : స్వర్గీయ రాజీవ్‌ ‌గాంధీ  వర్దంతి సందర్భంగా వనపర్తి పట్టణంలో రాజీవ్‌ ‌చౌరస్తాలో రాజీవ్‌ ‌గాంధీ విగ్రహానికి వినపర్తి జిల్లా అధ్యక్షులు శంకర్‌ ‌ప్రసాద్‌ ‌పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతు రాజీవ్‌ ‌గాంధీ సైన్సు టెక్నాలజి కమ్యూనికేషన్‌ ‌కంప్యూటర్‌ ‌రంగంలో దేశాన్ని 21 వ శతాబ్దం వైపు నడిపించిన గొప్ప మహానాయకుడు రాజీవ్‌ ‌గాంధీ అని ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో కంప్యూటర్‌ ‌ప్రతి ఒక్కరు చేతిలో సెల్‌పోన్‌ ఇన్‌ఫోసిస్‌ ‌టెక్నాలజి అభివృద్ది చెందిందంటే అది రాజీవ్‌గాంధీ చేపట్టినట్లు వారు గుర్తుచేశారు. ఆ మహనీయుని వర్దంతి సంధర్భంగా ఘన నివాళులు ఆయన స్పూర్తితో ముందుకు వెళదామని గుర్తు చేశారు.
నిత్యవసర సరుకులు అందజేత
రాజీవ్‌ ‌గాంధీ వర్దంతి సందర్భంగా రాష్ట్ర యూత్‌ ‌కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాజీవ్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ‌పార్టీ యువనాయకులు నందిమల్ల త్రినాథ్‌ ‌వనపర్తిలోని జంగాల గుట్టలో 150 మంది కుటుంబాలకు నిత్యవసర సరుకులు బియ్యం అందజేయడం జరిగింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy