Take a fresh look at your lifestyle.

డిజిటల్‌ ఇం‌డియాకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ

డిజిటల్‌ ఇం‌డియాకు ఆధ్యుడు స్వర్గీయ రాజీవ్‌ ‌గాంధీయేనని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం విజయ రమణారావు నివాసంలో 29వ వర్ధంతి పురస్కరించుకొని రాజీవ్‌ ‌చిత్ర పటానికి పూలమాల వేసి కాంగ్రెస్‌ ‌నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం విజయ రమణారావు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇన్‌ఫర్మెషన్‌ ‌టెక్నాలజీకి పితామహుడు రాజీవ్‌ ‌గాంధీయే అన్నారు. సిడాట్‌, ఎం‌టిఎన్‌ఎల్‌ ‌సంస్థలు రాజీవ్‌ ‌హయాంలోనే మొదలైనట్టు ఆయన గుర్తు చేశారు. రాజీవ్‌ ‌పరిపాలనలోనే కంప్యూటీకరణ ప్రారంభమైందన్నారు. దేశంలోని కోట్లాది మంది యువతియువకులకు 18సంవత్సరాలకే రాజీవ్‌ ఓటుహక్కు కల్పించారని ఆయన గుర్తు చేశారు. పంచాయితీరాజ్‌ ‌వ్యవస్థలో, దేశ విద్యావ్యవస్థలో అనేక కీలక సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు రాజీవ్‌ ‌సేవలను విజయ రమణారావు కొనియడారు.  మాజీ ఎంపిపి వేముల రాంమూర్తి, మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు నుగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్‌, ‌తూముల సుభాష్‌, ‌పెద్దకల్వల సర్పంచ్‌ ‌కరెంగుల రమేశ్‌, ఉప సర్పంచ్‌ అర్కుటీ సంతోష్‌ ‌యాదవ్‌, ‌దేవరకొండ రాజు, తదితరులు పాల్గొన్నారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో…
సిరిసిల్ల :  దివంగత ప్రధాని రాజీవ్‌గాంధి వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాంగ్రెస్‌పార్టి నేతలు నిరాడంబరంగా నిర్వహించారు.లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో సిరిసిల్ల,వేములవాడ పట్టణాల్లోని రాజీవ్‌ ‌గాంధి విగ్రహాల వద్దకు కాంగ్రెస్‌పార్టి శ్రేణులు అతి తక్కువగా చేరుకుని పూలమాలలు వేసి,నివాళులర్పించారు.సిరిసిల్లలో కాంగ్రెస్‌ ‌పార్టి అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ,వేములవాడలో పట్టణ కాంగ్రెస్‌పార్టి అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి,చందుర్తి మండల కేంద్రంలో వేములవాడ నియోజక వర్గ కాంగ్రెస్‌ ‌పార్టి ఇంచార్జి ఆది శ్రీనివాస్‌,‌జడ్పీటిసి సభ్యుడు నాగం కుమార్‌ ‌పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్‌ ‌గాంధి చేసిన కృషితో టెక్నాలజి మన దేశంలో గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిందని, రాజీవ్‌ ‌సేవలను దేశ ప్రజలంతా గుర్తు చేసుకుంటారని వ్యాఖ్యానించారు.

ఎల్లారెడ్డిపేటలో…
ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాల యం దగ్గర స్వర్గీయ రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. మండల కాంగ్రెస్‌ ‌కమిటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్‌ ‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి దినాన్ని సంఘ విద్రోహులకు వ్యతిరేకంగా పాటించే ఎటువంటి దినంగా కాంగ్రెస్‌  ‌పేర్కొందన్నారు.రాజీవ్‌ ‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్‌ ‌జవహర్‌ ‌యోజన పతకం ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీలంక తమిళ కుట్రకు బలైపోయిన రాజీవ్‌ ‌గాంధీని భారత దేశ ప్రజలు ఎన్నటికి మరిచిపోలేరన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ ‌గాంధీ నెహ్రూ వారి కుటుంబం మొత్తం కూడా ఉగ్రవాద చర్యలకు బలి అయిపోయినప్పటికి దేశం కోసం త్యాగం చేసిన కుటుంబంగా ఇందీరా గాంధీ కుటుంబానికి వర్తిస్తుందన్నారు.    లక్ష్మారెడ్డి, షేక్‌ ‌గౌస్‌, ‌లింగం గౌడ్‌, ‌రాజునాయక్‌, ‌బుచ్చగౌడ్‌, ‌గిరిదర్‌ ‌రెడ్డి, మానుక నాగరాజు, బాలు యాదవ్‌, శ్రీ‌నివాస్‌ ‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy