Take a fresh look at your lifestyle.

దేశ చరిత్రలో .. రాజీవ్‌ ‌గాంధీది చెరగని ముద్ర: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

  • జయంతి సందర్భంగా రాజీవ్‌కు కాంగ్రెస్‌ ‌నేతల నివాళి
  • వీర్‌భూమి వద్ద రాహుల్‌ ‌నివాళి

ఇందిరా గాంధీ, నెహ్రూ కుటుంబాలు దేశానికి చేసిన సేవలను తక్కువ చేసి చూపే ప్రయత్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా కూడా పార్లమెంటులో కాశ్మీర్‌ అం‌శాన్ని ప్రస్తావిస్తూ జవహర్లాల్‌ ‌నెహ్రూను తక్కువ చేసి చూపారని తెలిపారు. గురువారం స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ ‌గాంధీ 76వ జయంతి సందర్బంగా
కాంగ్రెస్‌ ‌శ్రేణులు గాంధీభవన్‌, అసెంబ్లీ లోని సిఎల్పీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం సోమజిగూడా లోని రాజీవ్‌ ‌గాంధీ విగ్రహానికి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…. దేశానికి, కాంగ్రెస్‌ ‌పార్టీకి, రాజీవ్‌ ‌గాంధీ ఎనలేని సేవ చేశారని  కొనియాడారు. దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కలిగిన ఘనత రాజీవ్‌ ‌గాంధీ•కే దక్కుతుందని స్పష్టం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయడం, పంచాయతీ రాజ్‌ ‌చట్టంలో మార్పులు తీసుకురావడం లాంటి వాటితో భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపారని తెలిపారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో కూడా ఏఐసీసీ ఆధ్యక్షుడుగా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాజీవ్‌ ‌గాంధీ బాటలోనే తామంతా నడుస్తామని..జిహెచ్‌ఎం‌సి, వరంగల్‌, ‌ఖమ్మం పురపాలక ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి, మంచి ఫలితాలు సాధిస్తామని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌ ‌నాయకులు అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

వీర్‌భూమి వద్ద రాహుల్‌ ‌నివాళి


న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ 76వ జయంతిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నేతలు రాజీవ్‌ ‌గాంధీకి నివాళులర్పించారు. అలాగే రాహుల్‌ ‌గాంధీ ఢిల్లీలోని వీర్‌భూమి వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్బంగా రాహుల్‌ ‌గాంధీ భావోద్వేగ ట్వీట్‌ ‌చేసారు. ప్రధానిగా తన తండ్రి అందించిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. ‘రాజీవ్‌ ‌గాంధీ లాంటి వ్యక్తి నా తండ్రి అయినందుకు, అలాంటి వ్యక్తికి కుమారుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను చాలా లక్కీ. భవిష్యత్తు ద ఆయనకున్న విజన్‌ ‌చాలా గొప్పది. ప్రతి రోజూ ఆయనను గుర్తు చేసుకుంటా’ అని రాహుల్‌ ‌తెలిపారు. రాహుల్‌ ‌గాంధీ, ట్విట్టర్‌ ‌వేదికగా తండ్రికి ఘన నివాళులర్పించారు. దార్శనికత ఉన్న నేతగా రాహుల్‌ ‌తన తండ్రి రాజీవ్‌ ‌గాంధీని అభివర్ణించారు. భవిష్యత్‌ ‌గురించి, భావి తరాల గురించి ఆలోచించిన రాజీవ్‌ ‌గాంధీ..సాటి వారి పట్ల అభిమానం, కరుణ కనబరిచేవారని పేర్కొన్నారు.

Leave a Reply