Take a fresh look at your lifestyle.

వీడిన మిస్టరీ

  • శిశువును తల్లి ఒడికి చేర్చిన ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర
  • మూడు రోజుల ఉత్కంఠకు తెర – ఊపిరి పీల్చుకున్న పోలీసులు 

భద్రాచలం: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నాడు అపహరణకు గురైన శిశువు గురువారం నాడు పోలీసులు కనుగొన్నారు. ఆ శిశువును ఆసుపత్రిలో ఉన్న తల్లి కాంతమ్మ ఒడికి చేర్చారు. వివరాల్లోకి వెళితే దుమ్ముగూడెం మండలం ములకనపల్లి గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణీ అయిన కాంతమ్మ మంగళవారం నాడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరింది. చేరిన కొద్దిసేపటికే ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆసుపత్రి సిబ్బంది ఆ శిశువును శభ్రం చేసి తల్లి ప్రక్కన పడుకోపెట్టారు. ఇది గమనించిన కృష్ణవేణి అనే మహిళ తీసుకొని వెళ్ళిపోయింది. పోలీసులు మంగళవారం నాడు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. పట్టణంలో ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్‌లను కూడ క్షుణ్ణంగా గమనించారు. ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర ప్రత్యేక శ్రద్దతో సమీపంలో ఉన్న అన్నీ పోలీస్‌ ‌స్టేషన్‌లకు సమాచారాన్ని తెలియచేసారు. దీనితో అలర్ట్ అయిన పోలీస్‌ ‌స్టేషన్‌లు కూడ వెతికే పని ప్రారంభించారు. ముఖ్యంగా ఏఎస్పీ ఆదేశాలతో పట్టణ ఎస్సై నరేష్‌ , ‌ట్రాఫిక్‌ ఎస్సై సురేష్‌ ‌ప్రధాన కూడళ్ళ వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గురువారం నాడు మణుగూరు ప్రాంతంలోని కూడ విస్తృతంగా తనిఖీ నిర్వహించగా ఒక మహిళ శిశువును అపహరించిందని సమాచారం అందటంతో ఆ మహిళ కృష్ణవేణిగా గుర్తించారు.

ఈమె మణుగూరు పట్టణంలోని సంతోష్‌ ‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు పక్కా సమాచారంతో హుటాహుటిన ఆమె వద్దకు వెళ్ళి విచారణ చేపట్టారు. తానే శిశువును తీసుకువెళ్లానని ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వెంటనే స్టాఫ్‌ ‌నర్స్ ‌సహాయంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉన్న తన తల్లి వద్దకు చేర్చారు. ఈ సంఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు శిశువు ఆచూకి లభించటం వెంటనే శిశువును తల్లి ఒడికి చేర్చటంతో ఊపిరి పీల్చుకు న్నారు. శిశువు అపరహరణకు గురైన మూడు రోజులకు శిశువు దొరకటంతో ఉత్కంఠకు తెరపడింది.

శిశువును తల్లి చేతికి అందించిన ఏఎస్పీ :

అపహరణకు గురైన శిశువును అతి చాకచక్యంగా పట్టుకుని తీసుకువచ్చి ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర చేతుల మీదుగా తల్లి కాంతమ్మకు అప్పగించారు. దీనితో తల్లి ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఇంత తొందరగా తన బిడ్డను తనకు అందచేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!