Take a fresh look at your lifestyle.

సిద్ధిపేటలో అమరువీరులకు నివాళులర్పించిన రాజేందర్‌

  • వివిధ సంఘాల నాయకుల ఘన స్వాగతం
  • భారీ కాన్వాయ్‌తో హుజూరాబాద్‌కు వెళ్లిన ఈటల

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ‌సిద్దిపేట-రంగధాంపల్లి చౌరస్తాలో గల అమరవీరుల స్థూపం వద్ద సోమవారం సాయంత్రం పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని అచ్చంపేట, హకీంపేట తదితర గ్రామాలలో రాజేందర్‌ ‌తనకు చెందిన జమున హెచరీస్‌ ‌కోసం పేదలకు చెందిన అసైన్డ్ ‌భూములను కబ్జా చేశారన్న ఆరోపణలు, జిల్లా యంత్రాంగం ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజేందర్‌ను సిఎం కేసీఆర్‌ ‌మంత్రి పదవీ నుంచి బర్తరఫ్‌ ‌చేసిన విషయం విధితమే.

మంత్రి పదవీ నుంచి రాజేందర్‌ను తప్పించిన అనంతరం మొట్టమొదటిసారిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు భారీ కాన్వాయ్‌తో శామీర్‌పేట-దేవరయంజాలలో గల తన స్వగృహం నుంచి బయలుదేరి మార్గమధ్యలో ఉన్న సిద్ధిపేట-రంగధాంపల్లి చౌరస్తాకు చేరుకోగానే ముదిరాజ్‌ ‌సంఘం నేతలతో పాటు వివిధ సంఘాలకు చెందిన నేతలు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాజేందర్‌ అమరవీరులకు నివాళురల్పించారు. రాజేందర్‌కు మద్దతుగా ముదిరాజ్‌ ‌సంఘం ప్రతినిధుతలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు నినాదాలు చేశారు. రాజేందర్‌కు బొగ్గులోనిబండ శంకర్‌ముదిరాజ్‌, ‌మిట్టపల్లి నర్సింగ్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

Leave a Reply