Take a fresh look at your lifestyle.

పీవీ కృషితోనే రాజీవ్ రహదారి మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట, జూన్ 28 (ప్రజాతంత్ర బ్యూరో): భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు కృషి వల్లే రాజీవ్ రహదారి నిర్మాణం జరిగిందనీ, దీని ద్వారానే ఉత్తర తెలంగాణ కు అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన ట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తనీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం పీవీ జయంతి సందరభంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ఆయన చిత్ర పటానికి పూలాలలు వేసి నివాులర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పీవీ చేసిన కృషిని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించారని హరీష్ రావు అన్నారు.సంస్కరణలకు నాందీ పలికిన గొప్ప నాయకుడు పీవీ అన్నారు. పీవీ నరసింహారావు వల్లే ఈనాడు భారత దేశం అనేరకాలుగా అభివృద్ధి చెందింద న్నారు.

ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆర్థిక శాఖ మంత్రి ని చేసిన ఘనత పీవీ దే నని అన్నారు. పీవీ నరసింహారావు ప్రధాని గా చేసిన అయాన గొప్ప పరిపాలన చేశాడని, అటువంటి మహనీయుడు పీవీ జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంద న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!