Take a fresh look at your lifestyle.

‘‌పట్టిసీమ’ తమ వాటా రావాల్సిందే

  • కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు
  • గోదావరి బోర్డుకు నివేదిక సమర్పణ
  • రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ ‌కుమార్‌

పట్టిసీమ నీటి విషయంలో తెలంగాణ వాటా ఇవ్వాలని కోరామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ ‌చెప్పారు. పోలవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీలు ఇస్తున్నారని తెలిపారు. సాగునీరు, ప్రాజెక్ట్‌ల విషయంలో నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తుచేశారు. పాత ప్రాజెక్ట్‌లకు డీపీఆర్‌ అడగొద్దని చెప్పామని, కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్ట్‌గా భావించొద్దని చెప్పామని పేర్కొన్నారు. లోకేషన్‌, ‌డిజైన్‌ ‌మార్పు లాంటి కారణాలతో కొత్త ప్రాజెక్ట్‌గా పరిగణించొద్దని, గోదావరిలో తెలంగాణ వాటా ప్రకారమే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. సాంకేతిక సమస్యలపై కృష్ణా, గోదావరి బోర్డులకు స్పష్టంగా
చెప్పామని రజత్‌కుమార్‌ ‌పేర్కొన్నారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్ ‌ప్రాజెక్ట్ ‌రిపోర్ట్ (‌డీపీఆర్‌)‌లను సమర్పించాల్సిందేనని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్టాల్రకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. బోర్డుతో పాటు కేంద్ర జల సంఘం, అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతులు రావాలంటే డీపీఆర్‌లు అవసరమని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశానికి నివేదిక ఇచ్చేందుకు.. కృష్ణాబోర్డు చైర్మన్‌ ‌పరమేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ‌జల సౌధలో గురువారం ఇరు రాష్టాల్ర అధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల తరఫున అధికారులు, ఇంజినీర్లు తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తరపున బోర్డులో వాదనలు వినిపించిన రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ ‌కుమార్‌ ‌వివరాలను వెల్లడించారు. గోదావరి బేసిన్‌లో ఒక్క కొత్త ప్రాజెక్టు లేదని వెల్లడించామని, కాళేశ్వరం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించకూడదని కోరామని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన వాటా ప్రకారమే ఎత్తిపోతల నిర్మాణం చేపట్టామని చెప్పారు. పోలవరం, పట్టిసీమపై బోర్డు దృష్టికి తీసుకుని వచ్చామని అన్నారు. పోలవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని వెల్లడించారు. టెలిమెట్రీల విషయం ఎక్కడా దాచిపెట్టడం లేదని తెలిపారు. సాంకేతిక సమస్యలపై కృష్ణా, గోదావరి బోర్డులకు స్పష్టంగా చెప్పామన్నారు. గోదావరి బేసిన్‌లో తమకు 967 టీఎంసీల వాటా ఉందని చెప్పారు. గోదావరి బేసిన్‌లో టెలిమెట్రీ ఏర్పాటుపై కమిటీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. 2014 జూన్‌ 2 ‌వరకు పూర్తయిన ప్రాజెక్టుల గురించి అడగవద్దని కోరామన్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, లోయర్‌ ‌పెన్‌గంగ ప్రాజెక్టులతోపాటు రామప్ప నుంచి పాకాల వరకు నీటి తరలింపు విషయమై ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!