Take a fresh look at your lifestyle.

రాజస్థాన్‌ ‌పరిణామాలు ఇరువర్గాలకూ గుణపాఠం

రాజస్థాన్‌ ‌లో మధ్యప్రదేశ్‌ ‌మాదిరి  కమలనాధుల గేమ్‌ ‌ప్లాన్‌ ‌ఫలించలేదు.   అందుకు కారణం ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న భిన్న రాజకీయ పరిస్థితులే కారణం. మధ్యప్రదేశ్‌ ‌లో  గ్వాలియర్‌ ‌రాజకుటుంబానికి చెందిన   జ్యోతిరాదిత్య సింధియా   అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ ‌విజయానికి కృషి చేసినా ఆయనకు  పార్టీ అధిష్ఠానం  ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.    ముఖ్యమంత్రి పదవి  కాకపోయినా, రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వలేదు.  పైగా, ఆయనను ఏకాకిగా చేయడానికి  పార్టీ సీనియర్‌ ‌నాయకుడైన దిగ్విజయ్‌ ‌సింగ్‌  ‌ముఖ్యమంత్రి కమలనాథ్‌ ‌తో చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో  జ్యోతిరాదిత్య పకడ్బందీ వ్యూహంతోనే   తన అనుచరులతో  కలసి పార్టీని వీడారు.
ఇందులో  కమలనాథులు పెద్దగా కష్టపడిందీ లేదు. వ్యూహాత్మకంగా నడుచుకున్నదీ లేదు.అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. కానీ, రాజస్థాన్‌ ‌లో పరిస్థితులు ఇందుకు భిన్నం,  అక్కడ కూడా  పార్టీ విజయం కోసం పాటు పడిన   యువనేత, పీసీసీ అధ్యక్షుడు  సచిన్‌ ‌పైలట్‌ ‌కు  ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు.  అయితే, ముఖ్యమంత్రి  అశోక్‌ ‌గెహ్లాత్‌   ‌సచిన్‌ ‌పట్ల అవమానకరంగా వ్యవహరించడం వల్ల  సచిన్‌  ‌ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేశారు.   పార్టీ అధిష్ఠానంపై మాత్రం కాదు.   కనుక ఆయన   పార్టీ వీడక పోవచ్చనీ,  ఒక వేళ వీడినా తిరిగి వస్తారని అంతా ఊహించిందే. అయితే, గెహ్లాట్‌ ‌పై ఆయన ఫిర్యాదులపై అధిష్ఠానం వెంటనే స్పందించకపోవడం వల్ల  ఆయన అలుక బూని అధిష్టానానికి షాక్‌ ఇచ్చారు.    రాజస్థాన్‌ ‌లో సచిన్‌  ఆశించినంత మంది  ఎమ్మెల్యేలు ఆయన వెంట వెళ్ళలేదు.  గెహ్లాట్‌ ‌రాజకీయ అనుభవంతో  మెజారిటీ ఎమ్మెల్యేలని తన వైపే  ఉండేట్టు చేసుకోగలిగారు.  అంతేకాక, సచిన్‌  ‌తిరుగుబాటు వ్యక్తిగత అంశాలపై జరిగిందన్న సంగతిని ఎమ్మెల్యేలకు  నచ్చజెప్పి, ఒప్పించడంలో  గెహ్లాట్‌ ‌వ్యూహం ఫలించింది.     పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి సచిన్‌ అత్యంత సన్నిహితుడు.   గెహ్లాట్‌ ‌మీద రాహుల్‌ ‌కు  సదభిప్రాయం లేదు.   వయసు రీత్యా అంతరం ఒక కారణం కాగా,   పార్టీలో కొత్త తరానికి అవకాశాలు కల్పించాలన్న రాహుల్‌ ‌ప్రతిపాదనను వ్యతిరేకించిన వారిలో దిగ్విజయ్‌, ‌గెహ్లాట్‌ , ‌కమలనాథ్‌ ‌ప్రభృతులు ఉన్నారు.అయితే,   గతంలో కేంద్ర మంత్రి పదవినీ, ముఖ్యమంత్రి పదవినీ నిర్వహించిన    గెహ్లాట్‌ ‌కు ఈసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం రాహుల్‌ ‌కి ఇష్టం లేదు. అయితే,  పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాత తరనాయకులకు ముఖ్యంగా,  మాజీ ప్రధాని రాజీవ్‌ ‌తో సన్నిహితంగా మెలిగిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు.   అలాంటి వారిలో గెహ్లాట్‌ ఒకరు.   రాహుల్‌ ‌తల్లి మాట కాదన లేక మౌనంగా ఉండిపోయారు.   రాజస్థాన్‌ ‌తాజా రాజకీయ డ్రామాను తెరవెనుక నుంచి నడిపించింది రాహుల్‌ అనే కథనాలు నిరాధారం కాదు.

మరో వంక రాజస్థాన్‌ ‌బీజేపీలో   మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే వర్గం  బలమైనది.  సచిన్‌ ‌ను బలవంతంగా బీజేపీలోకి తీసుకుని రావడం వల్ల ఆమె వర్గం బలహీన పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఆమె    సచిన్‌ ‌ని నచ్చజెప్పి ఒప్పించే   యత్నాల్లో పాలు పంచుకోలేదు.  పైగా నిరుత్సాహ పర్చారు.  సచిన్‌  ‌నాయకత్వంలో యువతరం నాయకులు   బీజేపీలో  బలపడితే తన ప్రాదాన్యం తగ్గుతుంది.  తన కుమారుడు దుష్యంత్‌ ‌ను ముఖ్యమంత్రిగా చేయాలన్న ఆమె ప్రయత్నాలకు అ అవరోధం కలగవచ్చు. ఆమె అసంతృప్తి, మనోభావాలు  గెహ్లాట్‌ ‌కు తెలుసు.   వాటిని   ఆయన ఉపయోగించుకుని  బీజేపీలో సచిన్‌ ‌ప్రవేశానికి పరోక్షంగా అడ్డంకులు సృష్టించారు. రాజస్థాన్‌ ‌లో  మొదటి నుంచి కుల రాజకీయాలు  ప్రాధాన్యం వ హిస్తున్నాయి. సచిన్‌ ఇతర వెనకబడిన తరగతుల కు  (ఒబీసీ)కి చెందిన వారు.  రాజస్థాన్‌ ‌రాజకీయాల్లో   మొదటి నుంటి    షెకావత్‌, ‌గెహ్లాట్‌, ‌వసుంధర వర్గాలదే  హవా.  వీరికి వ్యతిరేకంగా జాట్‌ ‌లు,  మీనా, తదితర సామాజిక వర్గాల వారు   చాలా కాలంగా పోరు సాగిస్తున్నారు.

 

Leave a Reply