శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా
6వ విడత హరితహారం కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి కల్వకుట్ల తారకరామారావు
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు.6వ విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆవునూరు పక్కనే గల మానే రు తీరాన మొక్కలు నాటి, ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలోని పోతిరెడ్డి పల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో అర్భన్ ఫారెస్ట్ పార్క్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి కెటిఆర్‌లు శంకుస్థాపన చేసిన సందర్భం గా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గతంలో సిరిసిల్ల ప్రాంతం దుర్భిక్షంగా ఉండేదని,ఆ సమయంలో గడ్డిని తాను ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి విక్రయించే వాడినని గుర్తు చేసుకున్నారు.ఈ దుర్భిక్ష సిరిసిల్ల ప్రాంతం ప్రస్తుతం రాష్ట్ర మంత్రి కెటిఆర్ నేతృత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో రాజన్న సిరిసిల్ల జిల్లా సస్యశ్యామ లం అవుతుందని,ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభు త్వం చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు విపక్షా ల నుండి మద్ధతు లభిస్తుందని అన్నారు.సకల మానవా ళి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని హరిత హారం కార్యక్రమానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారని ఆయ న వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 152 కోట్ల మొక్కలు నాటారని,మరో 30 కోట్ల మొక్కలు నాటడానికి సిఎం కెసిఆర్ మార్గనిర్ధేశం చేశారని అన్నారు.రాష్ట్ర భూభాగంలో కనీసం 33 శాతం గ్రీన్ కవర్ చేయాలనే లక్ష్యంతో ఈ హరిత హారం కొనసాగుతుందని అన్నారు.రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఆక్సిజన్‌ను కొనుగోలు చేయకుండా ఉండటానికే ఈ హరిత హారం కొనసాగిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం ఇతర రాష్ట్రాలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు.6వ విడత హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుగా అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశాన్ని నిర్వహించి,అడవులు పునర్జీవింప చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా సూచించారు.ఈ క్రమంలోనే అడవుల శాతాన్ని పెంచడానికి పట్టణాల కు 5 నుండి 7 కిలో మీటర్ల పరిధిలో అర్భన్ ఫారెస్ట్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, ప్రస్తుతం శంకుస్ధాపన చేసిన యేడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించా రు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ పరిధిలో 581హెక్టార్లలో పోతిరెడ్డిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉందని,దీనిలో 2వందల హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను అభివృద్ది చేస్తామని చెప్పారు.ఈ సమావేశం లో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు,జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ,కలెక్టర్ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్ అంజయ్య,ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య,జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి,మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ,పిసిఎఫ్ అక్బర్, డిఎఫ్ఓ డాక్టర్ ఆశ,ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఆర్డీఓ శ్రీనివాస రావు,ఎల్లారెడ్డిపేట జడ్పీటిసి సభ్యులు, ఎంపిపి,వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.