Take a fresh look at your lifestyle.

అద్భుతమైన రాజ్యంగ రచన చేసిన అంబేడ్కర్‌

  • ‌రాజ్‌భవన్‌ ‌రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ ‌తమిళిసై
  • కొరోనా టీకా అందరూ తీసుకోవాల్సిందేనని విజ్ఞప్తి

రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉందని గవర్నర్‌ ‌తమిళిసై అన్నారు. అంబేద్కర్‌ ‌దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారని చెప్పారు. శుక్రవారం రాజ్‌భవన్‌ ‌రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ ‌తమిళిసై మాట్లాడుతూ..రాజ్యాంగం కోసం రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి చేసిందన్నారు. ఏడు దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కుని దృఢంగా నిలిచిందని పేర్కొన్నారు. కొరోనా మహమ్మారి ఇంకా పోలేదని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. అందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని, రెండు డోసులు తీసుకోవాలని కోరారు.

‘కొరోనా టీకాపై ఇంకా కొందరికి అపోహలు ఉన్నాయి. టీకా తీసుకుంటేనే కోవిడ్‌ ‌నుంచి మరింత రక్షణ ఉంటుంది. టీకా పొందినవారికి ఇన్‌ఫెక్షన్‌ ‌సోకితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. టీకా తీసుకోనివారే 99 శాతం మంది ఐసీయూలో చేరుతున్నారు’ అని గవర్నర్‌ ‌తమిళిసై అన్నారు. హైదరాబాద్‌ ‌రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్‌, ‌తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply