Take a fresh look at your lifestyle.

దేశంలోనే ఒక వినూత్న పథకం ‘రైతుబంధు’

  • ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు చెల్లింపులు
  • ధాన్యం దిగుబడుల్లో రాష్ట్రానికి నల్లగొండ జిల్లా దిక్సూచి
  • నకిరేకల్‌ ‌సభలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి
  • వందపడకల హాస్పిటల్‌కు శంకుస్థాపన

రైతుబంధు దేశంలోనే ఒక వినూత్న పథకమని, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడ్డ తరవాత తెలంగాణ వ్యవసయా ముఖచిత్రమే మారిందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు. ఒకప్పుడు నీళ్లు లేక అల్లాడిని నల్లగొండ ఇప్పుడు అత్యదఙక ధాన్యం పండి స్తున్న జిల్లాగా నిలిచిందన్నారు. నకిరేకల్‌లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌మంగళవారం శంకుస్థాపన చేశారు. సూర్యాపేటలో కర్నల్‌ ‌సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ అనంతరం మంత్రులు కేటీఆర్‌, ‌జగదీశ్‌రెడ్డి స్థానికంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఓల్డ్ ‌వ్యవసాయ మార్కెట్‌ ‌వద్ద రోడ్డు విస్తరణ పనులకు అదేవిధంగా సవి•కృత మార్కెట్‌ ‌యార్డు నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి నుండి బయల్దేరి నల్లగొండ జిల్లా నకిరేకల్‌ ‌నియోజకవర్గ పర్యటనకు విచ్చేశారు. ఇందులో భాగంగా కేతేపల్లి మండలం, భీమారం గ్రామంలో రైతు వేదిక, పాఠశాల భవనాన్ని మంత్రులు కేటీఆర్‌, ‌జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా 2018లో సీఎం కేసీఆర్‌ ‌రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అంతకుక్రితం వైకుంఠ దామం, రైతు వేదికను ప్రారంభించారు. ఏడేండ్ల కిందట రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయో.. నేడు ఎలా ఉన్నాయో రైతులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. గతంలో వ్యవసాయం చేద్దామంటే నీళ్లు, కరెంటు ఉండేవి కావన్నారు. నల్లగొండ జిల్లాలోని ముశంపల్లి గ్రామం గురించి సీఎం కేసీఆర్‌ ఎప్పు‌డూ చెప్తుంటారు. ముశంపల్లి గ్రామంలో రాంరెడ్డి అనే రైతు 50కి పైగా బోర్లు వేస్తే చుక్కనీరు రాలేదు.

గతంలో అష్టకష్టాలు పడి రైతులు పంటలు పండిస్తే కనీసం మద్దతు ఉండేది కాదు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2018 నుంచి ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం ద్వారా అందించామన్నారు. ధాన్యం దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ట్రానికే దిక్సూచిగా మారింది. భారతదేశానికి మొత్తం తెలంగాణ దిక్సూచి అయితే 60 లక్షల టన్నుల ధాన్యం పండించి తెలంగాణకు నల్లగొండ జిల్లా దిక్సూచిగా అయిందన్నారు. వరిధాన్యం పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలిస్థానంలో ఉందని ఎఫ్‌సీఐనే కితాబు ఇచ్చిందని తెలిపారు. 26 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు, వారి సమస్యలు చర్చించుకునేందుకు రైతు వేదికలను నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. కోరోనాలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ‌పట్టుబట్టి మరీ 2,670 రైతు వేదికలను ఏర్పాటు చేయించారన్నారు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని తెలిపారు. దేశంలోని ఆయా రాష్ట్రాలు ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేస్తే.. ఆర్థిక సంక్షోభం ఉన్నా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలాగా దేశంలో ఎక్కడైనా వరిధాన్యం కొంటున్నారా? అని ప్రశ్నించారు.

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. రైతు ఏ కారణం చేత మరణించినా రైతుబీమా లాంటి పథకం ఆదుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఏ ప్రాజెక్టునైనా కేంద్రం తీసుకొచ్చిందా? మిషన్‌ ‌భగీరథకు నిధులివ్వాలని నీతిఆయోగ్‌ ‌కేంద్రానికి సూచిస్తే స్పందనే లేదన్నారు. 65 ఏండ్లు ప్రజలు అధికారమిస్తే కాంగ్రెస్‌ ‌ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్‌ ఆరున్నరేండ్లలో చేసి చూపించారని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ‌పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ ‌ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కైనా జాతీయ హోదా ఇచ్చిందా అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా వానాకాలంలోనూ అన్నదాతలకు రైతుబంధు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ లింగయ్య యాదవ్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌ ‌రావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్‌ ‌పాల్గొని మాట్లాడారు.

Leave a Reply