Take a fresh look at your lifestyle.

రైతే రాజు కావాలి…

వ్యవసాయమే ప్రధానమైన మనదేశంలో అధిక జనాభా దీనిపైనే ఆధారపడ్డ రంగంలోని రైతుల బతుకులు మారాలంటే ? వీరికి బిక్షం వేసినట్లు ఆకర్షణ పథకాలు కాదు. పాలనలో భాగస్వామ్యం కావాలి. రైతాంగ జనాభా దామాషాలో కేంద్ర, రాష్ట్ర, చట్టసభల్లో స్థానిక ప్రభుత్వాలలో వివిధ రంగాల నిపుణులకు ఇచ్చినట్లు రిజర్వేషన్లు కల్పించాలి. ఎమ్‌.ఎల్‌.‌సి., ఎమ్‌.‌పి.లుగా అవకాశం వస్తే వారి బాధలను తీర్చుకొనుటకు వారే చట్టాలు చేసుకునేలా రాజ్యాంగాన్ని సవరించైనా, ఈ ప్రక్రియకు పూనుకోవాలి. నూతన ఒరవడికి బీజం పడాలి. ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టి ఆకలిని తీర్చే రైతుల నోట మట్టి కొట్టకుండా.. గతంలో భారత రాజ్యాంగాన్ని వారి స్వార్థ ప్రయోజనాల కోసం పలుమార్లు మార్చుకున్నట్లు రైతుల జీవితాలకోసం మార్చాలి. అదే విదంగా రాజ్యాంగ సవరణ ద్వారా వారికి ప్రాతినిధ్యం పెంచి రైతు రాజ్యం వచ్చేలా చూడాలి. రైతే రాజు అనే ఊకదంపుడు ఉపన్యాసాలు మాని నిజాయితీ గల పాలకులుగా నిరూపించుకోవాలంటే ? రైతులకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి. మేదావులు సభల పేరుతో విధాన పరిషత్‌, ‌రాజ్యసభ, (ఆంగ్లో ఇండియన్ల్న) ఇలా వివిధ రంగాల నిపుణులకు చట్టసభల్లో స్థానం కల్పించినప్పుడు రైతులకు ఎందుకు కల్పించకూడదు ?

ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో సరళీకృత ఆర్థిక విధానాలను అమలులోకి తెచ్చాక పూర్తి సంక్షోభంలో కూరుకపోయింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై పెట్టుబడులు బడ్జెట్‌లో పెంచకపోగా, నయా కార్పోరేటు పెట్టుబడిదారీ విధానాలు వేగంగా అమలు చేస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా నేటికి 64% శాతం మంది మనదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇన్నేళ్ల స్వతంత్ర పాలనలో నేటికి నాట్లు వేయడం, విత్తనాలు చల్లడం, ఆకాశం వైపు చూడడం ఇంకా కొనసాగుతుందన్నది కాదనలేని నిజం. వర్షాకాలం ఆరంభమౌతున్న వేళ తొలకరి వానలు కురవగానే అదును, పదును తప్పిపోకుండా తొలక కార్తిలోనే విత్తనాలు విత్తుకోవాలన్న రైతన్న ఆరాటాన్ని సొమ్ము చేసుకోవాలని నకిలీ విత్తనాల నిల్వలు, వ్యాపారుల క్రూరమైన నేరగాళ్ళ విశసంస్క్నతి పునరావృతమై భయటపడింది. ‘‘నకిలీ విత్తన వ్యాపారులు – అక్షరాల రైతు హంతకులని’’ దీనిని సమూలంగా అరికడతామన్న పాలకుల మాటలు కార్యరూపం దాల్చకపోయినాయి. ఇన్నాళ్లు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ మనదేశీయంగా నాణ్యమైన విత్తనాలను అందుబాటు లోకి తెస్తారన్న భరోసా లేదు కదా ! రైతన్న నష్టపోతే పరిహారం అందుతుందన్న ధీమా లేదాయే ? దేశ ప్రజలందరికి పట్టెడన్నం పెట్టే రైతుల విత్తనాల్లో కల్తీ చేస్తున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. వ్యవసాయా (రైతాంగా)న్ని ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, తీరి పంటచేతికచ్చేసరికి వడగళ్ల వానలు నిలువునా ముంచుచున్నాయి. పంచ భూతాల్ని అమాంతంగా మింగేయాలన్న బడా పెట్టుబడిదారులు నయా కార్పోరేటు దారుల విచ్చలవిడి స్వార్థ పూరిత విధానాల మూలంగానే కరోనా, మిడుతలు, భూకంపాలు, తుఫానులు లాంటి విపత్కర(విపరీత) పరిణామాలు సంభవించడం జరుగుతుంది. కరోనా విపత్తు నుండైనా స్వార్థం వీడి ప్రకృతితో మమేకమై జీవనాన్ని సాగిద్ధామని గుణపాఠం నేర్చుకోవాలి. వ్యవసాయాన్ని, రైతంగాన్ని, కల్తీ వ్యాపారం, పంటల్లో శ్రమలో దోపడి చేసిన సంపాదనతో అవే నోట్ల కట్ట(డబ్బు)లను తిని బతకలేరుకదా ! చివరకు తినేది పట్టెడన్నమే అని గమనించండి. నేలను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ రైతులకు పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటుధర రాక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మవంచనతో వ్యవసాయం చేయడానికే భయకంపితులౌతున్నారు. విత్తనం నాటిన నాటినుండి పంట పండి డబ్బులు చేతికి వచ్చేవరకు రైతంగానికి అడుగడుగునా అనుక్షణం రక్షణగా వుంటూ వ్యవసాయం దండుగ కాదు పండుగ అనే రోజులు వచ్చేలా పాలకులు భరోసా ఏర్పరచాలి. అప్పుడే యువతరం వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. రైతాంగ(వ్యవసాయా)న్ని వ్యాపారులు, ప్రకృతి, పాలకులు ఇలా ఏ ఏటికి ఆ ఏడు ఎడాపెడా మూకుమ్మడిగా దాడులు చేస్తుంటే ? ఎలా సాగు చేస్తారు. రైతులకు మంచి రోజులు రావని నిరాశలో ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది. ఎన్నికల వేళ అధికార పీఠం కోసం రైతుల ఓట్లు పొందడానికి ఓటు బ్యాంక్‌ ‌పథకాలను చూపించి ఆశలు రేపినారు. చివరకు రైతుల జీవితాల్లో నిరాశలే పునారావృతం అవుతున్నాయి. రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వ్యవసాయానికి ఋణాలు ఎరువులు, పెట్టుబడి విత్తనాలు సమకూర్చి వారి జీవితాల్లో భరోసా ఏర్పడేలా చూడాలి. కానీ డబ్బై ఏళ్ల పైబడిన స్వతంత్రదేశంలో రైతుల బ్రతుకులు మార్చకపోగా ఏక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కొనసాగుతుంది.

వ్యవసాయమే ప్రధానమైన మనదేశంలో అధిక జనాభా దీనిపైనే ఆధారపడ్డ రంగంలోని రైతుల బతుకులు మారాలంటే ? వీరికి బిక్షం వేసినట్లు ఆకర్షణ పథకాలు కాదు. పాలనలో భాగస్వామ్యం కావాలి. రైతాంగ జనాభా దామాషాలో కేంద్ర, రాష్ట్ర, చట్టసభల్లో స్థానిక ప్రభుత్వాలలో వివిధ రంగాల నిపుణులకు ఇచ్చినట్లు రిజర్వేషన్లు కల్పించాలి. ఎమ్‌.ఎల్‌.‌సి., ఎమ్‌.‌పి.లుగా అవకాశం వస్తే వారి బాధలను తీర్చుకొనుటకు వారే చట్టాలు చేసుకునేలా రాజ్యాంగాన్ని సవరించైనా, ఈ ప్రక్రియకు పూనుకోవాలి. నూతన ఒరవడికి బీజం పడాలి. ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టి ఆకలిని తీర్చే రైతుల నోట మట్టి కొట్టకుండా.. గతంలో భారత రాజ్యాంగాన్ని వారి స్వార్థ ప్రయోజనాల కోసం పలుమార్లు మార్చుకున్నట్లు రైతుల జీవితాలకోసం మార్చాలి. అదే విదంగా రాజ్యాంగ సవరణ ద్వారా వారికి ప్రాతినిధ్యం పెంచి రైతు రాజ్యం వచ్చేలా చూడాలి. రైతే రాజు అనే ఊకదంపుడు ఉపన్యాసాలు మాని నిజాయితీ గల పాలకులుగా నిరూపించుకోవాలంటే ? రైతులకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి. మేదావులు సభల పేరుతో విధాన పరిషత్‌, ‌రాజ్యసభ, (ఆంగ్లో ఇండియన్ల్న) ఇలా వివిధ రంగాల నిపుణులకు చట్టసభల్లో స్థానం కల్పించినప్పుడు రైతులకు ఎందుకు కల్పించకూడదు ? ఇన్నాళ్లు రైతు ఆత్మహత్యలను ఆపలేదు. వ్యవసాయారంగాన్ని, రైతులను ఆదుకోవడం గత నేటి పాలకుల వల్ల కూడా కాదని రైతుల దృష్టిలో తేలిపోయింది. పార్టీకో రైతు సంఘం పేరుతో రైతును అసంఘటిత పరుస్తూ రైతులను ఏకం కాకుండా చేస్తున్న విధానాలకు స్వస్తి పలకాలి. రైతులంతా సంఘటితమై దోపిడి, దగాకోరు విధానాలకు చరమగీతం పాడాలి. రైతు రాజ్యం ఏర్పరచుకోవాలి, ఏర్పడాలి. అప్పుడే రైతుల సమస్యలు తీరి వ్యవసాయం బాగుపడుతుంది… కాదంటే ఇంకా మోసానికి గురి కాకమానదని గమనించండి.

ప్రశ్న అనేది చక్కని ‘‘పంట’’ అందించే విత్తనం లాంటిది. ఒక్క బీజం ఎన్నో ఫలాలనిచ్చి, అనేకుల ఆకలి తీర్చినట్లే ఒకేఒక్క ప్రశ్న అపారమైన చైతన్యాన్ని నింపుతుంది. ఎన్నో నూతన పరిణామాలకు పురుడు పోసుకుంటుంది. ఓ మహానుభావుడికి రాజ్య సభ సీటు ఇవ్వకుంటే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి అయినట్లే. మరో మహానుభావుడు మంత్రి పదవి ఇవ్వకుంటే ఆత్మగౌరవంతో రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయినట్లే. ఒక సాధారణ వ్యక్తి (చాయ్‌వాలా) అసాధారణమైన రీతిలో ప్రధానమంత్రై కూర్చుండగా లేనిది ! ఈ ఏటి ఏరువాకనుండే విత్తనాలతో పాటు చట్టసభల్లో సీట్లకోసం ప్రశ్నల విత్తనాలు నాటుదాం. అవి ఏదో ఒకనాడు రైతుకు రాజ్యాధికారం తేవడం కాయం. రైతంగం సంఘటితంగా పంటవిరామం (క్రాఫ్‌ ‌హాలీడే) అనే కఠిన నిర్ణయం తీసుకుంటే సమాజం ఆకలితో పెడబొబ్బలు పెడుతుందని గుర్తించండి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply