Take a fresh look at your lifestyle.

బ్యాక్‌ ‌లాగ్‌ ‌పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి పెంచాలి

కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం వినతి
విజయవాడ,జూలై20: ఏపీలో బ్యాక్‌ ‌లాగ్‌ ‌పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఏపీపీఎస్సీ ప్రతిపాదనలు ఆధారంగా 52 ఏళ్ల వయోపరిమితి పెంచాలని కోరుతూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపియస్‌) ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రికి లేఖ రాశారు. సాంఘిక సంక్షేమశాఖతో పాటు అన్ని వెల్ఫేర్‌ ‌విద్యా సంస్థలు, పాఠశాల విద్యలో బ్యాక్‌ ‌లాగ్‌ ‌టీచర్‌ ‌పోస్టులకు, ఇతరత్రా పోస్టులకు ఎస్సీల వయోపరిమితి 52 కు పెంచాలని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు జనరల్‌ అభ్యర్థులకు 47 ఏళ్లకు పెంచాలని ఏపీపీఎస్సీ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయస్సు 52కు పెరిగే అవకాశముందని తెలిపారు.

ఈ ప్రతిపాదనలను గమనించకుండా ఏపీ సాంఘిక సంక్షేమశాఖ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ‌పరిధిలోని ప్రిన్సిపాల్‌, ‌కేర్‌ ‌టేకర్స్ ఉద్యోగాలకు కేవలం ఎస్సీ, ఎస్టీలకు 47 ఏళ్ల వయస్సు లోపుగా నిబంధన విధిస్తూ అతి తక్కువ పోస్టులతో మంగళవారం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింద పేర్కొన్నారు. వయోపరిమితి పెంపులో సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ, ఎస్టీల పట్ల నిర్లక్ష్యం చూపిందని తెలిపారు. 2018లో వెలువడిన పాఠశాల విద్య, సాంఘిక సంక్షేమశాఖ తదితర విభాగాల్లో ఉపాథ్యాయ పోస్టులు భర్తీకి ఓపెన్‌ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 49వరకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు.

ప్రస్తుత సాంఘిక శాఖ బ్యాక్‌ ‌లాగ్‌ ‌పోస్టుల్లో ఆ విధానం చూపలేదన్నారు. చాలా జోన్లలో స్జబెక్టులు వారీగా ఖాళీలు చూపలేదు. కంటితుడుపుగా సాంఘిక సంక్షేమ శాఖ బ్యాక్‌ ‌లాగ్‌ ‌పోస్టులున్నాయని తెలిపారు. తక్షణమే ఇటీవల ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల ఆధారంగా బ్యాక్‌ ‌లాగ్‌ ‌పోస్టులకు ఎస్సీ ఎస్టీలకు 52 ఏళ్లకు పెంచుతూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

Leave a Reply