Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో వర్ష బీభత్సం.. అతలాకుతలం

  • 46 ఏళ్ల రికార్డు స్థాయిలో కుండపోత
  • నీట మునిగిన అంతర్జాతీయ విమానాశ్రయం
  • నదులను తలపించిన రాజధాని రోడ్లు
  • మరో రెండ్రోజుల పాటు వర్షాలు ఉంటాయని హెచ్చరిక

‌దేశ రాజధాని దిల్లీ వాసులను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున మరోసారి కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వరదనీరు చేరింది. రన్‌వే, టర్మినల్‌ 3 ‌ప్రాంతాల్లో నీరు నిలిచింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలను దారిమళ్లించారు. ఎయిర్‌పోర్టులో నీటిని తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం ఉదయం నుంచే జల్లులు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు చోట్ల రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది. అండర్‌పాస్‌ ‌వంతెనల వద్ద నీరు నిలవడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీ వ్యాప్తంగా ఇంకా మోస్తరు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. గత కొద్ది రోజులుగా దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

వర్షాకాలంలో దిల్లీలో ఈ స్థాయిలో కుండపోత కురవడం 46 ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. తెల్లవారు జాము నుంచి ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న గురుగ్రామ్‌, ‌మనేసర్‌, ‌ఫరీదాబాద్‌, ‌బల్లబ్‌ ‌గఢ్‌, ‌లోనీ దెహాత్‌, ‌హిండన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌స్టేషన్‌ ‌సహా ఔఅఖీ పరిధిలో… ఆగకుండా వాన కురుస్తుంది. ఊహించని భారీ వర్షంతో…అనేక చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఢిల్లీలోని పూల్‌ ‌ప్రహ్లాద్‌ ‌పూర్‌, ఇం‌డియా గేట్‌, ‌మధు విహార్‌, ‌మోతీ బాగ్‌, ‌ఖీఐ పురం, జోర్‌ ‌బాగ్‌ ఏరియాల్లో భారీ వర్షంతో కాలనీలు, రోడ్లపైకి నీరు చేరింది. ఢిల్లీలో రెండురోజుల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అలాగే వేగంగా గాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఢిల్లీలో అతి భారీ వర్షాలు కురవడం 10 రోజుల గ్యాప్‌లో ఇది రెండోసారి. గత వారం ప్రారంభంలో…భారీ వర్షాలకు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. మధ్యలో దాదాపు వారం గ్యాప్‌ ‌వచ్చింది. మళ్లీ ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి.

ఈసారి నైరుతి రుతు పవనాలు ఢిల్లీని ఆలస్యంగా పలకరించాయి. చాలా ఆలస్యంగా ఢిల్లీపై రుతు పవనాల ప్రభావం మొదలైంది. ఇంత లేట్‌ ‌కావడం ఇప్పటివరకు ఇదే ఫస్ట్ ‌టైమ్‌. అయితే వాటి ఎఫెక్ట్ ‌మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన వర్షపాతం వెయ్యి మిల్లీ మిటర్లు దాటిపోయింది. ఆ తర్వాత ఈ స్థాయిలో వర్షం పడడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2010లో వర్షపాతం వెయ్యి మిల్లీ మిటర్ల మార్క్ ‌దాటింది. ఈసారి ఇఫ్పటికే వెయ్యి ఐదు మిల్లీవి•టర్ల వర్షం కురిసింది. ఢిల్లీలో సాధారణ వర్షపాతం 648.9 మిల్లీమిటర్లు. ఈ నెల 1న ఢిల్లీలో 112.1 మిల్లీమిటర్ల వర్షం కురిసింది. 2న 117.7 మిల్లీమిటర్ల వాన పడింది. ఈ నెలలో ఇప్పటివరకు 248.2 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదైంది. నిజానికి ఢిల్లీలో సెప్టెంబర్‌ ‌యావరేజ్‌ 129.8 ‌మిల్లీమిటర్ల కాగా… 2 రోజుల్లోనే దాదాపు రెట్టింపు వర్షం కురిసింది.

Leave a Reply