Take a fresh look at your lifestyle.

వొచ్చే మూడు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ఎం‌డలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం అందించింది. మొత్తంగా రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల వల్ల ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో మెరుపులు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని, 30 నుంచి 40 కిలోవి•టర్ల వేగంతో ఈదురు గాలులు వీచనున్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రావణి పేర్కొన్నారు.

రాబోయే 24 గంటల్లో హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు రోజులు అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్‌, అత్యల్పంగా 29 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని శ్రావణి తెలిపారు. మండుటెండల నేపథ్యంలో జనాలు తమ నివాసాల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇంట్లోనే ఉంటే ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అటు ఇంట్లో ఉండలేని పరిస్థితి..ఇటు బయట కాలు పెట్టలేని పరిస్థితి.

Leave a Reply