Take a fresh look at your lifestyle.

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..

కొనసాగుతున్న అల్పపీడనం
నిండుకుండల్లా మారిన జలాశయాలు
పొంగుతున్న వాగులు, వంకలు
ధర్మపురి వద్ద గోదావరి ఉగ్రరూపం
శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
ములుగు జిల్లాలో పొంగిప్రవహిస్తున్న గోదావరి
మత్తడి పోస్తున్న లక్నవరం చెరువు
ఇంకా నీటిలోనే నిర్మల్‌ ‌పట్టణం
సింగూరు, జూరాలకు భారీగా వరదప్రవాహం
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. శుక్రవారం అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోవి•టర్ల ఎత్తులో ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వొచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటం, ఎగువ నుంచి భారీగా వరద వొచ్చి చేరుతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది.

Rains across the state ..

శ్రీరాంసాగర్‌ ‌నిండుకుండలా మారింది. జూరాల, సింగూరు ప్రాజెక్టులకు నీరు వొచ్చి చేరుతుంది. నిర్మల్‌ ‌పట్టణం ఇంకా నీటనే మునిగి ఉంది. ఇకపోతే ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్‌ ‌వద్ద గోదావరి 9,50,900 లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా.. అంతే మొత్తంలో 59 గేట్లను ఎత్తి దిగువకు పంపిస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్‌ ‌గ్రామం వద్ద ఉన్న లక్నవరం సరస్సు మత్తడి పోస్తున్నది. కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు వొచ్చి చేరడంతో లక్నవరం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని మత్తడి పడుతున్నది. నిండుకుండలా మారిన లక్నవరం అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.

భారీ వర్షాలకు పలు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వాటిని చూసి ఎంజాయ్‌ ‌చేసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. వెంకటాపూరం నూగూరు మండలం వీరభద్రపురం గ్రామ సవి•పంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ముత్యం ధార జలపాతం జలధారలతో పరవళ్లు తొక్కుతున్నది. పచ్చని కొండకోనల మధ్య 700 అడుగుల పైనుంచి జలపాతం జాలువారుతున్న దృశ్యాలు.. పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి. ఆసిఫాబాద్‌ ‌జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి దిగువకు 58,633 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Rains across the state ..

దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 58,673 క్యూసెక్కులుగా ఉంది. ఇక నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అలాగే, విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఎస్కేప్‌ ‌గేట్ల ద్వారా కాకతీయ కాలువ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వరద పెద్దఎత్తున వస్తుండడంతో మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్ట్ 33 ‌గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1089.80 అడుగుల వద్ద ఉన్నది.

జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలు. ప్రస్తుతం 83.772 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు పుల్కాల్‌ ‌మండలం, సింగూర్‌ ‌బాగారెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 4394 క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో ఉండగా.. అవుట్‌ ‌ఫ్లో 386 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం నీటి నిల్వ 19.864 టిఎంసీలుంది. ఈ ఏడాది జూన్‌ ‌నుంచి ఇప్పటి వరకు సింగూర్‌ ‌ప్రాజెక్టులోకి దాదాపు 5 టీఎంసీల నీరు చేరింది. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్ట్‌లోకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. అటు నారాయణపురం ప్రాజెక్టు నుంచి కూడా అవుట్‌ ‌ఫ్లో క్రమంగా పెరుగుతున్నది. దీంతో అధికారులు 15 గేట్లు ఎత్తి స్పిల్‌ ‌వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలలో ఐదు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 వి•టర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.800 వి•టర్లకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 6.401 టీఎంసీలుగా కొనసాగుతున్నది. ఇన్‌ ‌ఫ్లో 1,13,000 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ ‌ఫ్లో 1,23,867 క్యూసెక్కులుగా ఉంది. అలాగే దిగువకు 1,22,836 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిని గోదావరి వరద ప్రవాహం ముంచెత్తుతున్నది. ప్రస్తుతం రామాలయం వరకూ వరదనీరు నిలిచి ఉంది. నీటిలోనే సంతోషిమాత, గోదావరి మాత ఆలయాలున్నాయి. 1995 వరదల తర్వాత ధర్మపురిలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. పోలీస్‌, ‌రెవెన్యూ యంత్రాంగమంతా ధర్మపురి చేరుకుని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది.

Leave a Reply