Take a fresh look at your lifestyle.

మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు

ప్రజలను హెచ్చరించిన అధికారులు

విజయవాడ,ఆగస్ట్ 17 :  ‌రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర,రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు,మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.ఈ నేపథ్యంలో  రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కషనర్‌ ‌కన్నబాబు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం విధించిన కరోనా నియమాలను పాటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు సహకరించాలని కోరారు.వర్షాలు కురుస్తున్న సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను విడుదల చేశారు.
వర్షాలు భారీగా కురుస్తున్నందున వరదనీటిలోకి ప్రవేశించవద్దని, మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాన్నారు.విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్‌ ‌స్తంభాలు,పడిపోయిన విద్యుత్‌ ‌లైన్లకు దూరంగా ఉండండని సూచించారు.పెన్‌ ‌డ్రెయిన్స్ ‌లేదా మ్యాన్‌హూల్స్ను గుర్తించి ఆ ప్రదేశంలొ కనిపించే విదంగా చిహ్నాలు,ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్‌ ‌చేయవద్దు,రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోవాలన్నారు. తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినాలని,పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడాలన్నారు.

Leave a Reply