Take a fresh look at your lifestyle.

అకాలవర్షం అపార నష్టం

తెలకపల్లి, ఏప్రిల్‌ 29, (‌ప్రజాతంత్ర విలేఖరి) :అకాల వర్షం అపార నష్టం జరిగిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది మంగళవారం రాత్రి కురిసిన ఈదురు గాలులు వర్షం తో వరి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది  పైర్లు ఈదురు గాలులతో నేలకొరిగి  పొలాల్లో నీళ్లు నిలిచాయి రైతులకు తీవ్ర నష్టం ఏర్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు చొరవ తీసుకొని అకాల వర్షానికి వరి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మండల పరిధిలోని ఆలేరు గ్రామంలో  పిడుగుపాటుతో ఆవు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఆలేరు గ్రామానికి చెందిన తగిలి నిరంజన్‌ ‌కు చెందిన ఆవు మంగళవారం రాత్రి ఈదురు గాలులతో వర్షానికి తన వ్యవసాయ పొలంలో పిడుగు పడడంతో పొలంలో ఉన్నా ఆవు  అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు ఆవు విలువ 40 వేల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం అధికారులు తగు విచారణ చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా మండలంలోని   అకాల వర్షంతో తెలకపల్లి గట్టు రాయిపాకుల తదితర గ్రామాలలో విద్యుత్‌ ‌స్తంభాలు విరిగి పోవడంతో విద్యుత్‌ అం‌తరాయం ఏర్పడినట్లు మండల ప్రజలు తెలిపారు స్పందించిన విద్యుత్‌ ‌సిబ్బంది పడిపోయిన స్తంభాల వైర్లను తొలగించి ప్రమాదం జరగకుండా నివారించి నట్లు తెలిపారు.

Leave a Reply