ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 19 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ దేశ సమైక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్యీర్ వరకు సెపెటంబర్ 07 2022న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర 125వ రోజు చివరి దశకు చేరుకుని ఆఖరి రాష్ట్రం కాశ్మీర్ చేరుకుంది. గత 8 రోజులుగా పంజాబ్, హిమాచల్ ద్రేశలలో కొనసాగిన అనంతరం నేడు ఆఖరి రోజు పఠాన్కోట్లో నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ పాల్గొని మాట్లాడారు.
ర్యాలీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సహా పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. అనంతరం ఝండా అందజేత కార్యక్రమంతో యాత్ర లఖన్పూర్ వద్ద జమ్ము-కాశ్మీర్లోకి ప్రవేశించింది. జమ్ము కాశ్యీర్ ప్రవేశ స్థానం కథువా వద్ద నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాహుల్కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాగా యా్ర జనవరి 30న కాశీర్లో ముగియనుంది.