Take a fresh look at your lifestyle.

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడోయాత్రపై తెలంగాణ, మహారాష్ట్ర నేతల చర్చలు

  • కాంగ్రెస్‌ ‌నేత సంపత్‌ ‌నివాసంలో కీలక భేటీ
  • ఇరు రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంపై సమాలోచనలు
  • సమన్వయం కోసం కలిసి చర్చించామన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టి
  • రాహుల్‌ ‌చిలుకూరు, మెదక్‌ ‌చర్చిలు సందర్శించేలా ప్లాన్‌

‌ ‌రాహుల్‌ ‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర ఈ నెలలో తెలంగాణలో ప్రవేశించనున్న నేపథ్యంలో శనివారం తెలంగాణ, మహారాష్ట్ర నేతలు ఉమ్మడిగా చర్చించారు. తెలంగాణ తరువాత యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించనుంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల కాంగ్రెస్‌ ‌నేతలు యాత్ర విజయవంతంపై చర్చించారు. అనంతరం ఉభయనేతలు వి•డియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాంగ్రెస్‌ ‌నేత సంపత్‌ ‌నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..భారత్‌ ‌జోడోయాత్ర తెలంగాణలో దాదాపు 13 రోజులు ఉంటుందన్నారు. తెలంగాణ తర్వాత రాహుల్‌ ‌పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందన్నారు. పాదయాత్రపై మహారాష్ట్ర నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నేతలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇరు రాష్ట్రాలలో కామన్‌ ‌సమస్యలు ఉన్నాయని, వాటిని ఎలా ఎదుర్కునాలనే అంశంపై చర్చించామని రేవంత్‌ ‌పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నాయకులం కలిసి కర్నాటక వెళ్లి అక్కడి పరిస్థితులు అధ్యయనం చేస్తామన్నారు.

పాదయాత్రలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని తమ ఆరాటమన్నారు. వంద సంవత్సరాల వరకూ మళ్ళీ ఇలాంటి యాత్ర ఉండదన్నారు. ఇది దేశ భవిష్యత్తును మార్చే పాదయాత్ర అన్నారు. కనీసం 25 వేల మంది కాంగ్రెస్‌ ‌కార్యకర్తలతో మహారాష్ట్రకు రాహుల్‌ ‌గాంధీని తీసుకెళ్తామని రేవంత్‌ ‌తెలిపారు. రాహుల్‌ ‌గాంధీ చేస్తున్నది హిస్టారికల్‌ ‌పాదయాత్ర అని, మహారాష్ట్రలో ఎంటర్‌ అయ్యే ప్రదేశాన్ని పరిశీలిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రంలో కంటే ఎక్కువ ఎఫెక్ట్‌తో తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రలో పాల్గొనాలని మహారాష్ట్ర మాజీ మంత్రి నసీం ఖాన్‌ ‌మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేయడానికోసం రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర చేస్తున్నారని అన్నారు. దేశాన్ని కొందరు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని కలపడానికి రాహుల్‌ ‌పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేతలు అన్నదమ్ముల లాంటి వారని అన్నారు. రాహుల్‌ ‌పాదయాత్ర కోసం మహారాష్ట్ర ఎదురుచూస్తుందన్నారు. మహారాష్ట్ర సీఎల్పీ నేత బాల సాహెబ్‌ ‌మాట్లాడుతూ భారత్‌ ‌జోడో యాత్రకు మంచి స్పందన వొస్తుందన్నారు. పాదయాత్ర కోసం తెలంగాణలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?.. తామేం చేయాలనే అంశంపై అధ్యయనం కోసం వొచ్చామన్నారు. చరిత్ర గుర్తుంచుకోనేలా మహారాష్ట్రలో రాహుల్‌ ‌పాదయాత్రకు స్వాగతం పలుకుతామని బాల సాహెబ్‌ ‌స్పష్టం చేశారు.

రాహుల్‌ ‌చిలుకూరు, మెదక్‌ ‌చర్చిలు సందర్శించేలా ప్లాన్‌
అన్ని మతాల మధ్య ఐక్యతా భావాన్ని నింపేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ‌ప్రణాళికలు రచించింది. అందుకోసం దేవాలయాలు, చర్చిలు, మసీదులను రాహుల్‌ ‌గాంధీ సందర్శించనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ ‌భావిస్తున్నది. ఈ చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ ‌నగర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు రాహుల్‌ ‌పొందనున్నారు. ఆ తర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మెదక్‌ ‌చర్చికి వెళ్ళనున్నారు. హైదరాబాద్‌ ‌నగరానికి 44 కిలోవి•టర్ల పరిధిలో ఉన్న జహంగీర్‌ ‌దర్గాను కూడా సందర్శిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిని సందర్శించడం ద్వారా బీజేపీ దేశంలో చేస్తున్న మత విభజన రాజకీయాలకు గట్టి సమాధానం ఇచ్చినట్టువుతుందని కాంగ్రెస్‌ అం‌చనా వేస్తుంది.

Leave a Reply