రాజస్థాన్‌లో కొనసాగుతున్న యాత్ర
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 07 : దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర 91 రోజులు పూర్తి చేసుకోగా రాజస్థాన్ రాష్ట్రంలో 3 రోజలు పూర్తి చేసుకుని కొనసాగుతున్నది. బుధవారం ఉదయం రాజస్థాన్ రాష్ట్రం కోటలోని ధారా స్టేషన్ గణేష్ మందిరం వద్ద నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. పాద యాత్ర ప్రారంభించే ముందు గణేష్ మందిరంలో రాహుల్ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
కాగా రాహుల్ వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్, రాష్ట్ర పార్టీ చీఫ్ గోవింద్ సింగ్ జోటస్రా, రాష్ట్ర మంత్రులు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. ఉదయం సెషన్‌లో 13 కిలోమీటర్ల మేర పూర్తి చేసుకుని కోటా లాడ్‌పురా లోని మందాన చేరుకుని అక్కడ విశ్రమించింది. అనంతరం సాయంత్రం అక్కడి నుండి బయలు దేరి 9 కిలోమీటర్ల మేర కొనసాగి సాసా రిజార్ట్ చేరుకుకొనగా అక్కడ రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం జాగ్‌పురా చేరుకుని అక్కడ రాత్రి బస చేశారు.