Take a fresh look at your lifestyle.

‌ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉంది

  • లాక్‌డౌన్‌ అనంతర పరిణామాలపై స్పష్టత ఇవ్వాలి
  • ఇప్పటి నుంచే వ్యూహాన్ని ప్రకటించాలి
  • లాక్‌డౌన్‌ ఒక్కటే నియంత్రణ మంత్రం కారాదు
  • ర్యాపిడ్‌ ‌టెస్టింగ్‌లకు అనుమతులు చేపట్టాలి
  • డియాతో రాహుల్‌ ‌వీడియో కాన్ఫరెన్స్

కరోనా వైరస్‌ ‌నియంత్రణకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదు అని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. ప్రభుత్వం దూకుడుగా, వ్యూహాత్మకంగా కరోనా పరీక్షలు చేపట్టాలన్నారు. దేశవ్యాప్తంగా హాట్‌స్పాట్‌, ‌నాన్‌-‌హాట్‌స్పాట్‌ ‌జోన్లు ఉండాలని సూచించారు. అలాగే లాక్‌డౌన్‌ అనంతర చర్యలపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. కోవిడ్‌19‌పై రాహుల్‌ ‌గురువారం వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా డియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌తో కేవలం స్వల్ప కాలం మాత్రమే వైరస్‌ను నియంత్రించగలమని, కానీ టెస్టింగ్‌ను పెంచి, దాన్ని వెంటాడితేనే తప్ప ఆ వైరస్‌ ‌నుంచి శాశ్వత విముక్తి దక్కదన్నారు. దేశంలో ప్రస్తుతం టెస్టింగ్‌ ‌లెవల్స్ ‌తక్కువగా ఉన్నాయని రాహుల్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలను దూకుడు రీతిలో చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచన చేశారు. తన వ్యాఖ్యలను విమర్శలుగా స్వీకరించరాదని ఆయన అన్నారు. ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు.

వైరస్‌ను ఓడించాలంటూ దేశ ప్రజలు కూడా సంఘటితం కావాలన్నారు. గత కొన్ని నెలల నుంచి దేశ, విదేశీ నిపుణులతో వైరస్‌ ‌గురించి చర్చించానని, వారి చెప్పిన విషయాలను కు విన్నవిస్తున్నట్లు రాహుల్‌ ‌తెలిపారు. వైరస్‌ ‌పరీక్షలు నిర్వహిస్తేనే, అప్పుడు ఎవరినైనా ఐసోలేట్‌ ‌చేయడం వీలవుతుందన్నారు. మన టెస్టింగ్‌ ‌రేటు కేవలం 199-మిలియనగా ఉన్నట్లు రాహుల్‌ ‌చెప్పారు. ఇది జిల్లాకు 350గా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కరోనా మహమ్మారిపై రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ పోరాటం చేయాలని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ పిలుపునిచ్చారు. రాజకీయంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి ఇది సమయం కాదని, ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మక సలహాలివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీతో చాలా అంశాల్లో నేను విభేదిస్తా. కానీ, ఈ సమయం మాత్రం అందుకు సరైంది కాదు. అందరూ ఐకమత్యంతో ఉమ్మడి శత్రువుతో పోరాడాల్సిన సమయమిదని రాహుల్‌ ‌స్పష్టం చేశారు. ఈ రోజు తాను కేవలం సకారాత్మకంగానే మాట్లాడుతూ.. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఎవరిపై వ్యక్తిగతంగా, రాజకీయంగా బురద చల్లడానికి తాను మాట్లాడటం లేదని, అందరూ ఐకమత్యంతో కరోనా వైరస్‌పై పోరాడాల్సిన సమయమని రాహుల్‌ ‌తేల్చి చెప్పారు.

వలసకార్మికుల గోడు పట్టించుకోండి: సిబాల్‌
‌కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత కపిల్‌సిబాల్‌ ‌కేంద్రంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వలస కార్మికులు సరిహద్దు ప్రాంతాల్లో అల్లాడిపోతున్నారని, వారిపట్ల లాఠీచార్జ్ ‌చేయడం సరైంది కాదన్నారు. ఎక్కడివారు అక్కడే ఉండాలంటూ సుధీర్ఘ ప్రసంగాలు ఇచ్చే బదులు వారికి అవసరమైన రేషన్‌, ‌డబ్బు సహాయం అందించి ఈ కష్టకాలంలో వారికి తోడ్పాడునందించాలని అన్నారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా ఎక్కడివారు అక్కడే ఉండాలన్న ప్రభుత్వ సూచనను పాటిస్తున్నప్పుడు, ప్రజల బాగోగులు చూసే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక 21 రోజుల లాక్‌డౌన్‌ ‌కాస్తా మే3 వరకు ప్రకటించడంతో ముంబైలోని వలసకార్మికులు తమను స్వస్థలాలకు పంపాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు వారిపై లాఠీచార్జ్ ‌చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కష్టకాలంలో వలస కార్మికులు, నిరుపేదలకు ఆహారం అందించేందుకు తమ వంతు కృషిచేస్తున్న వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలను కపిల్‌ ‌సిబాల్‌ అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply