Take a fresh look at your lifestyle.

ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం ప్రధాని మోడీపై రాహుల్‌గాంధీ మండిపాటు

నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. నిరుపేదలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా డబ్బు అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడాన్నిఆయన తప్పుబట్టారు. నిరంకుశ
నిర్ణయాలతో కేంద్ర పెద్దలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని రాహుల్‌ ‌విమర్శించారు.

పేదలకు తక్షణమే రూ.10 వేల చొప్పున అందించి ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలపై కరోనా వైరస్‌ ‌చూపిన ప్రభావంపై ఓ వార్తా పత్రికలో వచ్చిన నివేదిక గురించి  రాహుల్‌ ‌ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమలు గ్టటెక్కాలంటే కేంద్రం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రజలు, పరిశ్రమలకు నేరుగా డబ్బు అందించడాన్ని నిరాకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేరమని రాహుల్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply