Take a fresh look at your lifestyle.

‌ప్రధానికేమో బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌విమానం

సైనికులకు డొక్కు ట్రక్కులా
ట్విట్టర్‌లో మండిపడ్డరాహుల్‌

‌మోదీ సర్కార్‌ ‌వీవీఐపీ హెలికాప్టర్‌ను ఖరీదుకు పెట్టిన ఖర్చు సైనికుల వాహనాలకు కూడా పెట్టడం లేదని కాంగ్రెస్‌ ఎం‌పి  రాహుల్‌ ‌గాంధీ మరోసారి ఫైర్‌ అయ్యారు. తన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేసిన రాహుల్‌.. ‌మన జవాన్లను నాన్‌ ‌బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌ట్రక్కుల్లో యుద్ధానికి పంపుతున్నారు, కానీ ప్రధాని మోదీ మాత్రం 8400 కోట్లతో ప్రత్యేక బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌విమానం తెప్పించుకున్నట్లు ఆరోపించారు. ఇది ఎంత వరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు.

రెండు నిమిషాలు ఉన్న వీడియోలో..బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌వాహనాలు ఉన్నా.. నాన్‌ ‌బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌వాహనాల్లో తమను తరలిస్తున్నట్లు జవాన్లు ఆరోపించారు. వరుసగా రెండవ రోజు రాహుల్‌ ఈ  అం‌శంలో విమర్శలు గుప్పించారు. గురువారం తన ట్వీట్‌లో సియాచిన్‌-‌లడాఖ్‌ ‌సైనికులకు ఎన్ని నిత్యావసరాలు కొనవచ్చో చెప్పారు. రెండు వీవీఐపీ విమానాల కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ నిశిత విమర్శలు చేశారు.  ట్రక్కుల్లో జవాన్లను పంపుతుండటంతో వారు అమర వీరులు అవుతున్నారని, ప్రధాని మాత్రం రూ.8,400 కోట్ల విమానంలో వెళ్తారని అన్నారు. ఇదేమి న్యాయమంటూ ఓ ట్వీట్‌లో ఆయన నిలదీశారు. వీవీఐపీ విమానాల గురించి రాహుల్‌ ‌మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గత వారం కూడా పంజాబ్‌లో జరిగిన ర్యాలీలో ఈ ప్రస్తావన చేశారు. ‘ఒకవైపు రూ.8,000 కోట్లు విలువ చేసే రెండు విమానాలను ప్రధాని మోదీ కొనుగోలు చేశారు. మరోవైపు చైనా మన సరిహద్దుల్లో ఉంది. మన భద్రతా బలగాలు గడ్డకట్టించే చలిలో అత్యంత సాహసంతో సరిహద్దుల్లో పహరా కాస్తున్నారు’ అని అన్నారు.

Leave a Reply