Take a fresh look at your lifestyle.

హత్రాస్‌కు రాహుల్‌, ‌ప్రియాంకలు మొత్తం ఐదుగురికి పోలీసుల అనుమతి

‌హత్రాస్‌ అత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీలకు, వారిద్దరితో సహా ఐదుమంది వెళ్లడానికి పోలీసులు అనుమతినిచ్చారు. అనుమతి లభించిన వెంటనే వారు హత్రాస్‌ ‌వెళ్లారు. వారు ప్రయాణించిన టాటా సఫారి వాహనాన్ని ప్రియాంక స్వయంగా డ్రైవ్‌ ‌చేయగా.. రాహుల్‌ ‌గాంధీ, మరో ఇద్దరు కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలు ఆమె వెంట ఉన్నారు. ఇక హథ్రాస్‌లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, హత్రాస్‌ ‌ఘటన వెలుగుచూసిన ఐదు రోజుల తర్వాత శనివారం అక్కడికి వి•డియాను కూడా అనుమతించారు. ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగిసిన నేపథ్యంలోనే వి•డియాకు అనుమతినిచ్చామని పోలీసులు తెలిపారు. కాగా, హత్రాస్‌ ‌గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్‌ 14‌న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని సబ్జల్‌గంజ్‌ ‌హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply