Take a fresh look at your lifestyle.

భారత్‌లో ఇంచు భూభాగాన్ని కూడా కదిలించలేరు

సరిహద్దుల్లో సైనికులను కలసిన రాజ్‌నాథ్‌ ‌సింగ్‌

‌న్యూదిల్లీ : భారత్‌, ‌చైనాలు సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలని,
అయితే చర్చలు సఫలమవుతాయన్న గ్యారంటీ ఏ లేదని భారత రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అన్నారు. నెల రోజుల తర్వాత మళ్లీ లఢక్‌ ‌వెళ్లిన రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌సైనికులను కలిసి వారి నుద్దేశించి మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన చర్చలు సమస్యను పరిష్కరించడానికే జరిగాయని, అయితే ఎంతమేరకు ఇవి సఫలమయ్యానే దానిపై గ్యారంటీ ఏ లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. అయితే భారత్‌ ‌భూబాగం నుండి ఒక్క అంగుళం భూమిని కూడా ఏ దేశమూ తీసుకు పోలేదని హా ఇచ్చారు.

పాంగాంగ్‌ ‌సరస్సు దగ్గరలోని లుకుంగ్‌ ‌పోస్ట్‌ను సదర్శించిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌పై వ్యాఖ్యలు చేశారు. రాజ్‌నాథ్‌ ‌రెండు రోజుల పర్యటన కోసం లఢక్‌, ‌జమ్ము కాశ్మీర్‌ ‌వెళ్లారు.
ఆయన వెంట ఢిఫెన్స్ ‌స్టాఫ్‌ ఆఫ్‌ ‌చీఫ్‌ ‌బిపిన్‌ ‌రావత్‌, ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఎంఎం ‌నరవాణెళి కూడా ఉన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ప్రపంచంలో ఏకైక దేశం భారత్‌ ‌మాత్రమేనని, ఏ దేశంపైన భారత్‌ ‌దండెత్తలేదని, ఏ దేశపు భూబాగాన్ని తమదిగా చెప్పుకోలేదని, వసుధైక కుటుంబం అనే భావనపై భారత్‌కు నమ్ముకముందని రాజ్‌నాథ్‌ అన్నారు. అశాంతిని భారత్‌ ‌కోరుకోదని, ఏ దేశపు గౌరవాన్ని కించపరచదని, అలాగని భారత దేశ గౌరవాన్ని కించపరిచేలా ఎవరైనా ప్రయత్నిస్తే గట్టి సమాధానం ఇస్తుందని మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!