Take a fresh look at your lifestyle.

సలహాదారు సజ్జలపై మండిపడ్డ రఘురామ

తనపై హత్యకు కుట్ర పన్నారని ఆరోపణ
కరోనా విజృంభిస్తుంటే జగన్‌ ‌చోద్యం చూస్తున్నారు

న్యూఢిల్లీ, :  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు నిప్పులు చెరిగారు. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనను టార్గెట్‌ ‌చేస్తూ ప్రత్యేకంగా మనుషులను నియమించారని.. సోషల్‌ ‌డియాలో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సజ్జల సూచన మేరకు తనకు సుమారు ఒక వంద ఫోన్‌ ‌కాల్స్ ‌వచ్చాయి జగన్‌ ‌రెడ్డి అని సీఎం జగన్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సజ్జల… సారీ బిజ్జల దిశానిర్దేశరతో.. నన్ను అసహనానికి గురి చేసి కేసులు వేద్దామని ప్లాన్‌ ‌చేసినట్టు వాళ్లు చెప్పారని ఆయన అన్నారు.  నీ ప్రభుత్వం పతనావస్థలో ఉంది.  కుట్రలను త్వరలోనే బయటపెడతాను. సైబర్‌ ‌క్రై ‌పోలీసులకు ఇవాళ నా వ్యక్తిగత కార్యదర్శి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని లేఖలో తెలిపాను. వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ ‌వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాను.  నన్ను ట్రాప్‌ ‌చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని చెప్పాను.  

సజ్జల నువ్వో జర్నలిస్ట్.. అనధికార మంత్రిలా వ్యవహరిస్తున్నావు. మహిళా మంత్రికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా అన్నీ వ్యవహారాలు చేస్తున్నావు.  బహిరంగ చర్చకు సిద్ధమా… నువ్వు చెప్పేది నువ్వు చెప్పు.. నేను చెప్పేది నేను చెబుతా అని సవాల్‌ ‌విసిరారు.  బుద్ధి తెచ్చుకో.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కోర్టులు ఉన్నాయి.  వెదవ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న అహంకారం వద్దు. సజ్జల, వైఎస్‌ ‌జగన్‌  ‌పరిధిల్లో ఉండండి.  చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోకండని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌  ‌పిచ్చివాడని నిర్దారణ అయ్యిందన్నారు.

సోమవారం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. కరోనా విలయతాండవం వేస్తుంటే.. ప్రజలు వ్యాక్సిన్లకోసం పడిగాపులుగాస్తుంటే.. కనీసం సక్షంచడం లేదన్నారు. విపక్ష నేతలు, తనపై కేసులు పెట్టడం పిచ్చి చర్యకాకపోతే మరేంటని ప్రశ్నించారు. కాబోయే సీజేఐపై కూడా ఫిర్యాదు చేశావ్‌.. ఇది పిచ్చి చర్య కాదా.. ఎక్కువ కాలం ఇది సాగదు. పాలకుడు పిచ్చివాడైతే పాలించే అర్హత లేదని రాజ్యాంగం చెబుతోంది. జగన్‌ ‌పరీక్ష చేయించుకోవాలి.. పిచ్చివాడని తేలితే పాలించే అధికారం మరొకరికి ఇవ్వాలి. లేకపోతే నువ్వు పిచ్చివాడివని కేసు నమోదు చేసి విచారణ జరపాల్సి ఉంటుంది. ఇది వాస్తవ ఆరోపణ.. నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘురామ అన్నారు. కరోనా చావులపై ఏపీ ప్రభుత్వం దొంగ లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై రాజద్రోహ నేరాలు మోపుతున్నారని విమర్శించారు. రోడ్లపై అనాథలుగా రోగులు పడిగాపులు గాస్తున్నారన్నారు. కేంద్రానికి లేఖ రాసేటప్పుడు 50 శాతం భరిస్తామని రాసి ఉంటే కేంద్రం అనుమతించేదని, మృత్యు గంటలు మోగుతుంటే జగన్‌ ‌రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారన్నారు. 

Leave a Reply