Take a fresh look at your lifestyle.

భారత్‌కు చేరిన రాఫెల్స్ – ‌శత్రువుల గుండెల్లో గుబులు

ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాఫెల్‌ ‌యుద్ధ విమానాలు భారత్‌ ‌గడ్డ్డపై అడుగుపెట్టాయి. భారతవాయుసేన అమ్ములపొదిలో మరో ఐదు రాపెల్‌ ‌ఫైటరు్ల చేరాయి. ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌మరింత బలోపేతం కాబోతోంది. శత్రుదేశాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోటానికి వాయుసేనకు మరింత బలం చేకూర్చడానికి భారతప్రభుత్వం ఫ్రాన్స్ 2016‌లో రూ. 59 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ ‌మొత్తం 36 రఫెల్‌ ‌జట్లను 2021 చివరి నాటికి అందించాల్సి ఉంది. అయితే ఈ విమానాలు ఒకేసారి కాకుండా దశల వారీగా భారత్‌కు రాబోతున్నాయి. అంతే కాకుండా ఈ ప్రత్యేక విమానాలను నడపడానికి కావాల్సిన శిక్షణ కూడా ఫ్రాన్స్ ‌దేశంలోనే ఇవ్వబడుతుంది. దీని కోసం మొత్తం 36మంది ఐఏఎఫ్‌ ‌పైలట్లు ఆదేశంలోనే శిక్షణ తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఐదు రాఫెల్‌ ‌యుద్ధ విమానాలు బుధవారం అంబాలాలోని భారత వైమానిక దళంలో చేరడానికి ఫ్రాన్స్‌లోని ఒక ఎయిర్‌బేస్‌ ‌నుండి భారతదేశానికి బయలుదేరాయి. ఫ్రాన్స్ ‌నుంచి దాదాపు 7000 కిలోమీటర్ల ప్రయాణించనున్న ఈ విమానాలు మార్గమధ్యంలో యూఏఈలోని ఫ్రాన్స్ ఎయిర్‌బేస్‌లో ఆగాయి. ఇప్పుడొచ్చిన బ్యాచ్‌లో ఐదు రాఫెల్‌ ‌జెట్‌ ‌ఫైటర్లలో మూడు విమానాలు రెండు సీట్లవి కాగా, రెండు విమానాలు మాత్రం సింగిల్‌ ‌సీట్‌ ‌విమానాలు. రాఫెల్‌ ‌ఫైటర్లలో అత్యంత విధ్వంసకర ఆయుధాలుంటాయి రాఫెల్‌ ‌ఫైటర్‌ ‌ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండెల్లో రైళ్లు పరిగెడుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అత్యంత ఆధునిమైనక సాంకేతిక పరిజ్ఞానం, శక్తివంతమైన మరియు అతి సునిశితమైన రాడార్లు, ఎలక్ట్రానిక్‌ ‌యుద్ధ తంత్ర వ్యవస్థలు, స్వీయ రక్షణ సూట్లు రాఫెల్‌ ‌ఫైటర్ల సొంతం. అంతే కాకుండా వేగంగా స్పందిస్తూ, దూసుకెళ్లడం . ఆయుధాల్ని బలంగా పట్టుకొనే లక్షణాలతో శత్రువులపై దాడిచేయడంలో వీటికి తిరుగులేని ట్రాక్‌ ‌రికార్డ్ ఉం‌టుందని శాస్త్రవేత్తల సమాచారం.

దాదాపు మూడు వేల కిలోమీటర్ల రేంజ్‌ ఉం‌డే స్కాల్పన్‌లు (గగనతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే క్షిపణులు), సుదూర లక్ష్యాలను ఛేదించే మెటియోర్‌(ఎయిర్‌ ‌టు ఎయిర్‌) ‌మిస్సైళ్లు వీటి సొంతం. ఇవి గగనతలంలోకి ఎగిరాయంటే శత్రుదేశాలపై విరుచుకుపడతాయి. రాఫెల్‌ ‌యుద్ధ విమానాలు 780 కిలోమీటర్ల పరిధిలో ప్రభావాన్ని చూపించే శక్తి వీటి సొంతం. ప్రత్యేక ఆపరేషన్లలో 1,650 కిలోమీటర్ల వరకు సత్తా చూపే సామర్ధ్యం వీటికుంది.ఇజ్రాయెల్‌ ‌తయారుచేసిన హెల్మెట్‌ ‌డిస్‌ ‌ప్లే ద్వారా పైలెట్లకు సమయం ఆదా అవుతుంది. శత్రు దేశాల రాడార్లను, ఎలక్ట్రానిక్‌ ‌వ్యవస్థలను నిర్వీర్యం చేసే ‘లో బ్యాండ్‌ ‌జామర్లు’ ఈ విమానాల మరో ప్రత్యేకత. ప్రత్యేకించి అతి ఎత్తయిన ప్రాంతాల్లోనూ రాఫెల్‌ ‌సమర్థతలో ఎలాంటి తేడా ఉండకపోవడం వీటి మరో విశేషం.ప్రత్యేకించి క్షిపణి వ్యవస్థ దీనికి బలాన్ని ఇస్తుంది. భారతీయ వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా పలు మార్పులు చేపట్టారు. ఇజ్రాయెల్‌ ‌నిర్మిత హెల్మెట్‌ ‌డిస్‌ప్లేయర్‌, ‌రాడార్‌ ‌వార్నింగ్‌ ‌రిసివర్స్, ‌తక్కువ స్థాయి జామర్స్, 10 ‌గంటల విమానయాన గణాంక సామర్థ్యం, ట్రాకింగ్‌ ‌సిస్టమ్స్, ‌ప్రత్యేకమైన ఇన్‌‌ఫ్రా రెడ్‌ ‌సెర్చ్ ‌ప్రక్రియ వంటివి రాఫెల్స్‌కు అదనపు ఆకర్షణలు. మొత్తం 36 రాఫెల్స్‌లో 30 ఫైటర్‌ ‌జెట్స్ ‌కాగా ఆరు శిక్షణ విమానాలు. పూర్తి స్థాయిలో ఫైటర్‌ ‌జెట్స్‌నుపోలి ఉండే ఇవి రెండు సీట్లతో అమరి ఉండి, యుద్ధ విమానాల పైలెట్లకు శిక్షణకు ఉపయోగపడుతాయి.

ఈ యుద్ధ విమానాలకు ఉన్న ఇంజిన్లు 11000 పౌండల ఫోర్స్‌తో పనిచేస్తాయి. అందువల్ల ఈ ఫైటర్‌ ‌జెట్లు గంటకు 1912 కిలోమీటర్లువేగంతో వెళ్లగలవు. 3 డ్రాప్‌ ‌ట్యాంకులతో 3700 కిలోమీటర్ల రేంజ్‌ ‌వెళ్లగలవు. వీటిలో 16ఖీ జీరో జీరో ఎజెక్షన్‌ ‌సీటు కారణంగా జీరో స్పీడ్‌, ‌జీరో ఆల్టిట్యూడ్‌లో కూడా ఆపరేషన్‌ ‌చెయ్యగలరు. రాఫెల్‌లో ఎయిర్‌-‌టు-ఎయిర్‌ ‌మిస్సైళ్లు ఉంటాయి. అలాగే ఎయిర్‌-‌టు-గ్రౌండ్‌ ‌మిస్సైళ్లు, ఎయిర్‌-‌టు-సర్ఫేస్‌ ‌మిస్సైళ్లు ఉంటాయి. వాటితోపాటూ అణ్వాయుధాలు కూడా ఉంటాయి. •జు•• రాడార్‌తో ఇవి దూసుకెళ్తాయి. మన దేశానికి వచ్చే విమానాల్లో 28 విమానాలకు సింగిల్‌ ‌సీటు, 8 విమానాలకు డబుల్‌ ‌సీటు ఉండబోతోంది. 15.27 మీటర్ల పొడవు ఉండే రాఫెల్‌కి రెక్క పొడవు 10.80 మీటర్లు ఉంటుంది. ఆయుధాలు లేని రాఫెల్‌ ‌బరువు 9900 కేజీల నుంచి 10600 దాకా ఉంటుంది. టేకాఫ్‌ ‌సమయంలో మాగ్జిమం 24500 కేజీల దాకా ఉండగలవు. ఇన్నిప్రత్యేకతలుఉన్నందునే 19ఏండ్లక్రితమే అప్పటివాజ్‌పేయ్‌ ‌ప్రభుత్వం రాఫెల్‌ ‌ఫైటర్‌ ‌విమానాలను కొనుగోలు చేయాలనుకున్నది. అయితే 2007లో యూపీఏ హయాంలో కొనుగోళ్ల విషయం ముందుకుకదిలింది. అనేక దేశాల నుంచి టెండర్లను పిలిచింది. కానీ, 2012 నాటికే అది అగ్రిమెంట్‌ ‌దశకి వచ్చింది. రూ.54వేల కోట్ల ఖర్చుతో 126 రాఫెల్‌ ‌జట్‌ ‌ఫై•టర్ల కోసం డీల్కుదుర్చుకున్నది. 18 విమానాలువెంటనేవచ్చేట్లు, మిగిలినవి బెంగళూరులో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌లో తయారు చేసేట్లు డీల్‌ ‌కుదిరింది.ఆ తర్వాతఅధికారంలోకి వచ్చిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2015 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌కి వెళ్లిన మోదీ, యూపీఏ హయాంల చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేశారు. 36 జెట్‌ ‌ఫై•టర్లే కొంటున్నటు్ల ప్రకటన చేసారు. ఫ్రాన్స్ ‌కంపెనీ ద సోఏవియేషన్‌తో ఒప్పందంకుదిరింది. కరోనా వైరస్‌ ఉన్నప్పటికీ రాఫెల్‌ ‌యుద్ధ విమానాల్ని షెడ్యూల్‌ ‌ప్రకారమే డెలివరీ చెయ్యాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌జూన్‌ 2‌న కోరారు. ఆ ప్రకారమేవాటిని ఇచ్చేందుకు ఫ్రాన్స్ ‌ప్రభుత్వం ముందుకొచ్చింది. కాగా రాఫెల్‌ ‌యుద్ధ విమానాలతో భారత దేశ ఆయుధ సంపత్తి అత్యంత శక్తివంతంగా రూపుదిద్దుకుంటుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

dr md quazaidin
డా।। ఎండి ఖ్వాజామొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫై•నాన్స్

Leave a Reply