Take a fresh look at your lifestyle.

రేడియో ఈ శతాబ్దపు బలమైన మీడియా

ప్రజలకు అత్యంత చేరువై దినదిన ప్రజాదరణతో వెలుగొందుతున్న ఈ శతాబ్దపు విశిష్ఠ జనమాధ్యమం రేడియో. ప్రచార ప్రసార సాధనాలు ఎన్ని వచ్చినా రేడియోస్థానం చెరగనిది. పండిత పామరులను అక్షర నిరక్షరాస్యులను పల్లె పట్టణ ప్రాంత ప్రజలను ఆబాలగోపాలన్ని ఏక కాలంలో అలరించే ఏకైక ప్రసార సాధనము రేడియో. 1893 మార్కొని మొట్టమొదటిసారిగా సెయింట్‌ ‌లూయిస్‌ ‌మిస్సోరిలో వైర్‌లైస్‌ ‌రేడియో ప్రసారాలను ప్రారంభించారు. 1896లో ఇంగ్లాండ్‌ ‌వైర్‌లైస్‌ ‌పెటెంట్‌ ‌హక్కులను పొందింది. తదుపరి ఇంతితై వటుడింతై అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా రేడియో ప్రసారాలు విస్తరిస్తుపోయాయి.ఐక్యరాజ్యసమితి రేడియో 1946 ఫిభ్రవరి 13న ప్రారంభమైంది 2012 నుంచి ఆ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాము.

మనదేశంలో 1923 జూన్‌లో బ్రిటీష్‌ ‌ప్రభుత్వం బొంబాయిలో రేడియో ప్రసారాలు ప్రారంభించింది. హైదరాబాద్‌ ‌నగరంలో 1935లోనే మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ :‌దక్కన్‌రేడియో’ను ప్రారంభించారు. యుద్ద వార్తలు ప్రభుత్వ సమాచారం కొంత సమయంలో సంగీత కార్యక్రమాలకే పరిమితమైన రేడియో స్వాతంత్య్ర తర్వాత జనబహుళ్యానికి చేరువయ్యే కార్యక్రమాలను ప్రసారం చేయడం ప్రారంభించింది.1957 అక్టోబర్‌ 2‌న ‘వివిధభారతి ’ పేరిట జనరంజకమైన ప్రసారాలకు శ్రీకారం జరిగింది. అప్పుడు దేశంలో 2,75,000 మంది లైసెన్స్‌దారులు ఉన్నారు.

ప్రస్తుతం మనదేశంలో 420 రేడియో స్టేషన్లు 23 భాషలలో దాదాపు రోజుకు 17 గంటలకు పైగా నిరంతర కార్యక్రమాలు ప్రసారం చేస్తూ దాదాపు 91 శాతం పైగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది రేడియో. ఆకాశవాణి ప్రధాన ఉద్ధేశ్యం ప్రజలకు సమాచారం అందించడం. అనేక సంక్షోభ సమయాల్లో, విపత్తుల సమావేశాల్లో మారుమూల ప్రాంతాలకు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు రేడియో చేస్తున సేవలు మరువలేము.

మారుమూల ప్రజలకు సమాచారంతో పాటు వినోదం అందించడంలో (ఆకాశవాణి) అందిస్తున్న సేవలు అజరామరమైనవి. అన్నిభాషలో సినిమా పాటలు, వార్తలు, వివిధ శీర్షికలు క్రింద శ్రోతలు కోరుకున్న కార్యక్రమాలు అందజేస్తూ దాదాపు 60 సంవత్సరాల నుండి కోట్లాది అభిమాన శ్రోతలను సంపాదించింది.వివిధ భారతి తెలుగు కార్యక్రమాలకు దాదాపు 40 లక్షలమంది రెగ్యులర్‌ ‌శ్రోతలు ఉన్నట్టు ఒక అంచనా. చాల గ్రామాల్లో దినసరి కూలీలు చేనేత కార్మికులు, బీడికార్మికులు, క్షురకులకు, దర్జీలకు ప్రతిరోజు రేడియో కార్యక్రమాలు ఒక అలంబన. ఎంతోమంది ఉన్నత అధికారులు, ఉద్యోగులు వివిధ హోదాలలో ఉన్న వారికి ముఖ్యంగా గృహిణులు, విశ్రాంత ఉద్యోగులకు ఆకాశవాణి ఒక ప్రియనేస్తం.

రోజువారి పనిచేసుకుంటూ శ్రమను మర్చిపోయే వినోదాన్ని పొందే ఆకాశవాణి శ్రోతలది ఒక కుటుంబం. వారిది ఒక హొప్రపంచం. రేడియోతో వారి అనుబంధం విడదియ్యలేనిది. ఇప్పటికి పోస్ట్ఆఫీస్‌కు వెళ్ళి ఉత్తరాలు కొనుక్కోని నచ్చిన సినిమా పాటలు వ్రాయడం, తిరిగి వాటిని రేడియోలో వినడం అనేది ఒక అనుభూతి. వేలాది మంది శ్రోతలు ఇప్పటికి అసంఖ్యాక ఉత్తరాలు వ్రాస్తున్నారంటే రేడియో ఎందరి జీవితాలతో మమైకమైపోయిందో తెలుస్తుంది.

ప్రతిరోజు శ్రోతలకు బోర్‌ ‌కొట్టకుండా వివిధ వినూత్న శీర్షికతో విజ్నానాన్ని అందిస్తూ వినోదభరితమైన కార్యక్రమాలు రూపొందించడంలో సమర్పించడంలో వివిధభారతి లోని వివిధ విభాగాలు పడుతున్న శ్రమ శ్రోతలకు వినబడటమే కాదు కనబడుతుంది.చక్కటి భాషా, స్పష్టమైన ఉచ్ఛారణతో సందోర్చచిత పాటలు వివిధ ప్రత్యేక దినోత్సవాలు సందర్భాలు వివరిస్తూ విశ్లేషిస్తూ ప్రసారం చేసే కార్యక్రమాలు చాల పరిశోధనాత్మకంగా ఉంటాయి.

1997లో ప్రసారభారతి కార్పోరేషన్‌ ఏర్పాటు అయిన నాటి నుండి ఆకాశవాణి దురదర్శన్‌లకు గడ్డుకాలం మొదలైంది. కొత్త రిక్రూట్‌మెంట్‌ ‌లేక ప్రమోషన్లు లేక డిప్యూటేషన్లతో నెట్టుకురావడం. క్రమక్రమంగా ప్రైవేట్‌ ఎఫ్‌.ఎం ‌లకు అనుమతులు ఇవ్వడం. మొదలైన చర్యలతో ప్రభుత్వాలే ఆకాశవాణిని అణగదొక్కాయి. ‘ఆకాశవాణి’ అందరిది. వివిధభారతి విభిన్న వర్గాలది, దీనిని కాపాడుకోవడము అందరి బాధ్యత. కాలంతో పాటు ప్రసార ప్రచార మాధ్యమాలలో సాంకేతికంగా మార్పులు వచ్చినా రేడియో స్థానం విశిష్ఠంగానే కొనసాగుతుంది.

suresh kaleru
సురేష్‌ ‌కాలేరు –
రాష్ట్రసహాద్యక్షులు
తెలంగాణా ఉద్యోగుల సంఘం
9866174474

Leave a Reply