నెల్సన్ మండేలా జీవితం నిత్య పోరాటాల మయమని మనందరికీ ఆదర్శప్రాయం. వర్ణ, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, తన జీవితాన్ని సమాజోన్నతికి దారపోసిన మండే అగ్ని కణం మన నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా జీవితాన్ని ప్రపంచ నేటి యువతకు పరిచయం చేయడానికి, తాను నమ్మిన జీవన విలువల నుంచి ప్రేరణ పొందడానికి ప్రతి ఏట నెల్సన్ మండేలా జన్మదినమైన 18 జూలై రోజున ‘అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినం’ పాటిస్తున్నాం. ఐరాస జనవరల్ అసెంబ్లీ తీర్మానంతో 18 జూలై 2010 నుంచి ఈ దినోత్సవం ప్రారంభమైంది. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు వెతకడానికి, సకారాత్మక మార్పుకు బీజం వేయాలని, సమసమాజ స్థాపనకు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికలను నిర్వహిస్తున్నాం.
నెల్సన్ మండేలా జీవితం నిత్య పోరాటాల మయమని మనందరికీ ఆదర్శప్రాయం. వర్ణ, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, తన జీవితాన్ని సమాజోన్నతికి దారపోసిన మండే అగ్ని కణం మన నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా జీవితాన్ని ప్రపంచ నేటి యువతకు పరిచయం చేయడానికి, తాను నమ్మిన జీవన విలువల నుంచి ప్రేరణ పొందడానికి ప్రతి ఏట నెల్సన్ మండేలా జన్మదినమైన 18 జూలై రోజున ‘అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినం’ పాటిస్తున్నాం. ఐరాస జనవరల్ అసెంబ్లీ తీర్మానంతో 18 జూలై 2010 నుంచి ఈ దినోత్సవం ప్రారంభమైంది. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు వెతకడానికి, సకారాత్మక మార్పుకు బీజం వేయాలని, సమసమాజ స్థాపనకు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికలను నిర్వహిస్తున్నాం. మానవ సేవలో తన జీవితాన్నే అర్పించిన నెల్సన్ మండేలా మానవ హక్కుల లాయర్‌గా, చరసాలనే సమాజ మార్పుకు వాడుకున్న విలక్షణ వ్యక్తిగా, అంతర్జాతీయ శాంతి స్థాపన యోధుడిగా, దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా ప్రపంచ మానవాళికే శాంతి సంక్షేమ దారి దీపస్తంభంగా నిలిచారు. అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినం వేదికగా ప్రజాహిత జీవన విలువలు, నిస్వార్థ స్వచ్ఛంధ సేవ, సంక్షోభ నివారణ, జాతి-వర్ణ వివక్ష, మానవ హక్కుల పరిరక్షణ, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, బాలల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, దాతృత్వం, సాంస్కృతిక పునరుజ్జీవనం, హెచ్ఐవి-ఏయిడ్స్ అవగాహన, ప్రపంచ శాంతి లాంటి అంశాల పట్ల అవగాహన కల్పించుట జరుగుతుంది.
18 జూలై 1918న దక్షిణ ఆఫ్రికా రాయల్ తెంపూ కుటుంబంలో మండేలా జన్మించారు. సౌత్ ఆఫ్రికా విశ్వవిద్యాలయంలో బిఏ పట్టాను, పోర్ట్ హేరి విశ్వవిద్యాలయంలో యల్యల్బి న్యాయశాస్త్ర పట్టపొంది, జొహెనెస్బర్గ్లో న్యాయవాదిగా పని చేశారు. జాతి వివక్ష వ్యతిరేక పోరాటాని ఆకర్షితుడై, 1943లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రేస్లో చేరి యువజన విభాగాన్ని నెలకొల్పారు. 1944లో ఎవెలిన్ మాస్‌ను వివాహమాడిన మండేలా 1958లో విడాకులు తీసుకున్నారు. 1958లో విన్నీ మడికిజెలాను వివాహమాడి 1996లో విడాకులు తీసుకున్నారు. 1998లో గ్రేక మాచెల్‌ను 3వ భార్యగా వివాహమాడిన మండేలాకు మ్నెత్తంగా ఏడుగురు సంతానం కలిగారు. జాగతి వివక్ష పోరులో పలు మార్లు జైలు పాలైన మండేలా, 1962లో జీవిత ఖైదీగా శిక్ష విధించారు. 1964 – 82 వరకు రాబెన్ దీవిలో, 1988 వరకు పోల్స్ముర్ కారాగారంలో ఖైదీగా జైలు జీవితం అనుభవించారు. దాదాపు 27 ఏండ్లు కారాగార జీవితం అనుభవించిన మండేలా నాటి అధ్యక్షుడు డీ క్లార్క్ ఆదేశంతో 1990లో జైలు నుంచి విడుదల అయ్యారు.
దక్షిణ ఆఫ్రికా తొలి అధ్యక్షుడిగా (1994 – 99) సేవలు అందించిన మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రేస్ అధ్యక్షుడిగా (1991 – 97), అలీన ఉద్యమ సెక్రటరీ జనరల్‌గా (1998 – 99) విశిష్ట సేవలు అందించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. నెల్సన్ మండేలా అసమాన్య సేవలకు గుర్తుగా నోబెల్ శాంతి బహుమతి (1993), భారతరత్న (1990), నిషాన్-ఇ-పాకిస్థాన్ (1992), లెనిన్ శాంతి బహుమతి (1990), సఖరోవ్ బహుమతి (1988) లాంటి పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. నెల్సన్ మండేలా జీవిత చరిత్రను ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ పుస్తకరూపంలో వెలువరించారు. బాల్యంలో ‘రోహిలాలా మండేలా’ పేరుతో పిలువబడ్డ నెల్సన్ మండేలా 50కి పైగా విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డిగ్రీలు పొందారు. శాంతి మంత్రాన్ని శ్వాసిస్తూ, క్షమాగుణాన్ని ప్రదర్శించిన మండేలా సానుకూల దృక్పథంతో ముందు చూపు కలిగిన మేధావిగా రుజువు చేసుకున్నారు. 05 డిసెంబరు 2013న తన 93వ ఏట జొహనెస్‌బర్గ్‌లో తుదిశ్వాస విడిచారు. విధ్వంసం చేయడం అత్యంత సులభమేగాని, హీరోలా శాంతిని నెలకొల్పడం చాలా కష్టమని నమ్మిన నెల్సన్ మండేలా దాదాపు ఏడు దశాబ్దాలు ప్రజా సేవలో జీవితాన్ని త్యాగం చేశారు. ఒక వ్యక్తి మహాశక్తిగా రూపాంతరం చెంది దక్షిణ ఆఫ్రికాతో పాటు ప్రపంచ మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన నెల్సన్ మండేలా జీవితం అన్ని తరాల ప్రజలకు ప్రేరణాత్మకం, ప్రశంసనీయం, అనుసరణీయం.
– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కవి, రచయిత, వైజ్ఞానికశాస్త్ర విశ్లేషకులు