Take a fresh look at your lifestyle.

20 మంది బాలకార్మికులకు విముక్తి గాజుల కర్మాగారంపై దాడులు

‌రాచకొండ పోలీసులు పక్కా సమాచారంతో  ఎర్రకుంటలోని గాజుల కర్మాగారంపై సోమవారం దాడులు నిర్వహించారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న దాదాపు 20 మంది బాల కార్మికులకు ఈ సందర్భంగా విముక్తి కల్పించారు. ఈ విషయమై రాచకొండ సీపీ మహేష్‌ ‌భగవత్‌ ‌వి•డియా సమక్షంలో అనేక సంచలన విషయాలు మాట్లాడారు. బీహార్‌ ‌నుండి పిల్లలను అక్రమంగా తరలించి, బలవంతంగా పిల్లలతో గాజుల తయారీలో పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారికి కనీసం భోజన సదుపాయం కూడా కల్పించడంలేదని, అర్ధరాత్రి వరకు కూడా వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో నలుగురు ఆర్గనైజర్లను అరెస్ట్ ‌చేశామని పేర్కొన్నారు.

మెడికల్‌ ‌పరీక్షలు నిర్వహించిన తరువాత 20 మంది చిన్నారులను వారి స్వస్థలాలకు పంపిస్తామని సీపీ మహేష్‌ ‌భగవత్‌ ఈ ‌సందర్భంగా వెల్లడించారు. ఇక ఈ ఆపరేషన్‌లో దాదాపు ఓ 9 మందిని పోలీసులు విచారించాల్సి వుంది. కాగా వారు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం… కొన్నాళ్ల క్రితం సదరు చిన్న పిల్లల తల్లి దండ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌ ‌లలో తమ పిల్లల మిస్సింగ్‌ ‌విషయమై పిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక వెతికి వేసారి అలసిపోయిన తల్లి దండ్రులు తమ పిల్లలు చనిపోయి ఉంటారని అనుకున్నారు.  కానీ కొన్నాళ్ల తరువాత వాళ్ళ జాడ తెలియడంతో ఇక వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వారు హైదరాబాద్‌ ‌పోలీసు అధికారులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply