Take a fresh look at your lifestyle.

ఆర్‌ – 3 ‌గేట్‌ ఎత్తడంతో 11 చెరువులు నిండుతాయి…

చిన్నకోడూర్‌ ‌మండలం చందలాపూర్‌ ‌గ్రామ శివారులో ప్రధాన ఎడమ కాలువలో పారుతున్న నీళ్లను మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాగా ఆర్‌ -3 ‌గేట్‌ ఎత్తడంతో 11 చెరువులు నిండనున్నాయని, వాటిలో చిన్నకోడూర్‌, ‌మాచాపుర్‌, ‌విఠలాపూర్‌, ‌గంగపూర్‌, ఇ‌బ్రహీంనగర్‌, ‌గుర్రాలగొంది, జక్కాపూర్‌ ‌తదితర గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుతాయని, ఇందు కోసం అవసరమైన అసంపూర్తి ఓటీ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు స్థానిక రైతు రాములుతో ఏం సంగతి బాపు.. కాలువల్లో నీళ్లు వచ్చాయంటూ.. సంబురమేనా.. ఇక చింత పుకార్తె పంట పండించేందుకు సిద్ధం చేసుకోవాలని రైతుకు మంత్రి చెప్పగా., అన్నీ సిద్ధం చేసుకున్నా.. సార్‌ అం‌టూ రైతు రాములు బదులిచ్చారు.

ఎడమ కాలువలో పక్షుల ఫోటోలు తీసిన మంత్రి…
ఎడమ కాలువ పరిశీలిస్తున్న క్రమంలో రక రకాల పక్షులు సేద తీరుతున్న విషయాన్ని గమనించి తన సెల్‌ ‌ఫోనులో ఫోటోలు తీశారు మంత్రి హరీశ్‌ ‌రావు.

Leave a Reply