Take a fresh look at your lifestyle.

దేశాన్ని కదిలించిన క్విట్‌ ఇం‌డియా పిలుపు !

మహిమాన్వితమైన మన గత చరిత్రను, స్వాతంత్రోద్యమ ప్రాముఖ్యతను మన భవిష్యత్‌ ‌తరాలతో పంచు కోవడం మన బాధ్యత. 75 సంవత్సరాల క్రితం ఈ దేశం స్వేచ్ఛ కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించవలసి వచ్చిందో నేటితరం తెలుసుకోవాలి. అందుకే స్వాతం త్యాన్రికి సంబంధించి ఈ సంవత్సరాన్ని అమృత సంవత్సరంగా పరిగణిస్తున్నాము. దేశ స్వాతంత్య్ర కోసం వీరోచితంగా పోరాడి కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోని కొందరు వీరుల గాథలతో వారి త్యాగాలను గుర్తించే విధంగా కార్యక్రమాలు జరుగు తున్నాయి నేడు దేశంలో, వారు చేసినవి త్యాగాలు మాత్రమే కాదు, వాటి ద్వారా భవిష్యత్‌ ‌తరాలకు ఎనలేని ప్రేరణ కలిగించారు. ఇందులో క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. అదే మనకు స్వాతంత్రం దక్కేలా చేసింది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆగస్టు నెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సహాయ నిరాకరణోద్యమం 1920 ఆగస్ట్ 1‌వ ప్రారంభమైంది. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం 1942 ఆగస్ట్ 9‌న మొదలైంది. దీన్ని ఆగస్ట్ ‌క్రాంతి అని పిలుస్తారు. భారతదేశానికి స్వాతంత్య్ర 1947 ఆగస్ట్ 15‌న వచ్చింది. క్విట్‌ ఇం‌డియా అనే గంభీరమైన తీర్మానం క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో నిర్ణయాత్మకంగా మారింది.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో క్విట్‌ ఇం‌డియా ఉద్యమం అనేది ఎంతో ముఖ్యమైన మైలురాయిగా చెప్పు కోవాలి. ఈ ఉద్యమం బ్రిటీష్‌ ‌పాలన నుంచి భారతదేశాన్ని ఎలాగైనా విముక్తి చేయాలనే దృఢ సంకల్పం ప్రతీ ఒక్క భారతీయుడిలో రగిలించింది.ఈ సమయంలోనే దేశ ప్రజలంతా ఏకమయ్యారు. గ్రామాలు నగరాలు, విద్యావంతులు, నిరక్షరాసులు, ధనికులు, పేదలనే తేడాలు లేకుండా క్విట్‌ ఇం‌డియా ఉద్యమం కోసం దేశంలోని నలు మూలల నుండి ప్రజలు తరలివచ్చారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉద్యమంలో భాగస్వా మ్యులయ్యారు. లక్షలాది మంది ప్రజలు మహాత్మాగాంధీ అందించిన డూ ఆర్‌ ‌డై అనే నినాదాన్ని ఎవరికి వారే మంత్రంగా మార్చుకుని తమను తాము పోరాటానికి అంకితం చేసుకున్నారు. దేశంలోని యువత తమ పుస్తకాలను, అధ్యయనాలను త్యజించి మరీ కవాతుకు బయలుదేరారు. మహాత్మాగాంధీ 1942 ఆగస్ట్ 9‌న క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొన్న ప్రతీ ప్రముఖ నాయుకుడ్నీ బ్రిటీష్‌ ‌ప్రభుత్వం జైలుపాలు చేసింది. ఈ సమయంలోనే డా. రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా, జయ్‌ ‌ప్రకాష్‌ ‌నారాయణ, అ•రుణ అసఫ్‌ అలీ వంటి గొప్ప వ్యక్తులతో కూడిన రెండోతరం నాయకత్వం కీలక పాత్ర పోషిం చింది. నిజానికి బ్రిటిష్‌ అరాచక పాలనలో కుతకుతలాడుతున్న భారతీయులు.. చావో రేవో అంటూ గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఉవ్వెత్తున పోరాట బరిలోకి దూకిన అరుదైన ఘట్టం అది. సమాచార వ్యవస్థ నామమాత్రంగా ఉన్న ఆ రోజుల్లో.. దేశంలోని ప్రతి ఊరిలో ప్రజలు ఎవరికి వారే నాయకులై.. కదం తొక్కిన చారిత్రక సంగ్రామం.

అదే క్విట్‌ ఇం‌డియా. అనేక పోరాటాల సమాహారమైన భారత స్వాతంత్య ఉద్యమంలో అదో మైలురాయి. నిజానికి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించే నాయకుడంటూ ఎవరూ అప్పటికి అందుబాటులో లేరు. ఉద్యమానికి ఊపిరి పోసిన గాంధీజీ, ఆయనతో పాటు నెహ్రూ తదితర అగ్రనేతలందరినీ బ్రిటిష్‌ ‌ప్రభుత్వం జైల్లో పెట్టింది. దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు ఎవరూ లేకున్నా.. ప్రజల సమరోత్సాహంతో ఆ ఉద్యమం మ••••జ్వలంగా సాగింది. భారత స్వాతంత్య ఉద్యమంలో అగ్రగణ్యులు లోకమాన్య బాలగంగాధర్‌ ‌తిలక్‌, ‌గోపాలకృష్ణ గోఖలేల విజ్ఞప్తి మేరకు 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన మహాత్ముడు 1917 నుంచి 1942 వరకు దాదాపు 25 ఏళ్లపాటు వివిధ రకాల ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం అందకుండా పోతోందనే ఆవేదన ఆయనలో గూడు కట్టుకుపోయింది. 1942 జూన్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ’నేను అసహనానికి గురవు తున్నాను’ అని వ్యాఖ్యానించడమే ఇందుకు ఉదాహరణ. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన రెండు నెలలకే ఆగస్టు 8న క్విట్‌ ఇం‌డియా ఉద్య మానికి మహాత్ముడు పిలుపునిచ్చారు. ’విజయమో.. వీర స్వర్గమో’ అంటూ గర్జించారు.

భారత్‌కు వచ్చిన మహాత్మాగాంధీ 1917 నుంచి 1942 వరకు దాదాపు 25 ఏళ్లపాటు వివిధ రకాల ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం అందకుండా పోతోందనే ఆవేదన ఆయనలో గూడు కట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 1942.. ఆగస్టు ఎనిమిదో తేదీన బొంబాయిలోని గోవాలియా ట్యాంక్‌ ‌మైదానంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా స్వరాజ్యం కోసం పార్టీ కార్యవర్గ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలంతా కొత్త గాంధీని చూశారు. ఆయన నోటి వెంట సమర గర్జనను విన్నారు. భారతీయులంతా అప్పటికి అనేక సంవత్సరాలుగా అలుపెరగక పోరాడుతున్నా.. ఉద్యమ ఫలం ’అందని ద్రాక్షగా’ ఉందని ఆయన ఆవేదన చెందారు. అదే ’క్విట్‌ ఇం‌డియా’ పిలుపునకు దారితీసింది. రెండో ప్రపంచ యుద్ధంలో తమకు సహకరిస్తే.. స్వయం పాలన ఇస్తామని చెప్పిన బ్రిటిష్‌ ‌పాలకులు చివరకు వచ్చేసరికి ’డొమినియన్‌ ‌స్టేటస్‌’ అం‌టూ మెలిక పెట్టింది. ఈ ప్రతిపాదనను భారతీయులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఈ మెలికపై తీవ్రస్థాయిలో మండిపడిన కాంగ్రెస్‌ ‌పార్టీ భారతీయులకు స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశం బ్రిటిష్‌ ‌వారికి లేదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చింది.

అనంతరం వార్దాలో సమావేశమై బ్రిటిష్‌ ‌వారికి వ్యతిరేకంగా ప్రజలను కార్యో న్ముఖులను చేస్తూ భారీ ఉద్యమం చేపట్టాలని తీర్మానించింది. గాంధీజీ పిలుపుతో ఆగస్టు 9న పుణె, అహ్మదాబాద్‌లలో లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. పదో తేదీన దిల్లీ, ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌బిహార్‌లలో నిరసనలు మిన్నంటాయి. క్రమంగా ఉద్యమం దేశవ్యాప్తంగా గ్రామస్థాయికి విస్తరించింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరాహార దీక్షలు చేశారు. కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరిం చారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లు, పోస్టాఫీసులు, రైల్వేస్టేషన్లపై ఆందోళనకారులు దాడులు చేశారు. చాలా చోట్ల రైలు పట్టాలను తొలగించారు. వంతెనలు, టెలిఫోన్‌ ‌స్తంభాలను కూల్చివేశారు. మరో వైపు.. బ్రిటిష్‌ ‌సర్కారు దొరికిన వారిని దొరికినట్లు జైళ్లలో పడేసింది. ఇలా సెప్టెంబరు వచ్చేసరికి దేశంలోని జైళ్లన్నీ నిండిపోయాయి. ’క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో బ్రిటిష్‌ ‌సైనికులు 50వేల మంది భారతీయులను కాల్చి చంపారని’ సోషలిస్ట్ ‌నాయకుడు రామ్‌మనోహర్‌ ‌లోహియా అప్పటి వైస్రాయ్‌ ‌లిన్‌లిత్‌గోకు లేఖ రాశారంటే అణచివేత ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి మహోజ్వల పోరాటం సత్ఫలితాన్నే ఇచ్చింది. తర్వాత అయిదేళ్లకు 1947లో కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీకగా స్వతంత్ర భారత్‌ ఆవిర్భవించింది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ 

Leave a Reply