Take a fresh look at your lifestyle.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి జిల్లా కలెక్టర్‌ ‌శ్వేతామహంతి

Quickly resolve complaints

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ‌శ్వేతామహంతి అధికా రులను ఆదేశించారు. సోమ వారం నాడు ప్రజావాణి కార్యక్ర మంలో భాగంగా వివిధ ప్రాం తాలనుంచి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి 40 ధరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

పోలీస్‌‌ప్రజావాణిలో 7ఫిర్యాదుల స్వీకరణ..
జిల్లా అదనపు ఎస్పీ షాకీర్‌హుసేన్‌ ‌స్వయంగా ఫిర్యాదుదారుల నుండి ధరఖాస్తులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సమస్యలుల అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్‌ అధికారులకు ఫిర్యాదులను సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదమపు ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదు)లో 3 భూఫిర్యాదులు, 2 భార్యాభర్తల ఫిర్యాదులు, 2 పరస్పర గొడవల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

నేడు జిల్లా పరిషత్‌ ‌సర్వసభ సమావేశం
వనపర్తి,జనవరి,27(ప్రజాతంత్ర విలేకరి) : వనపర్తి జిల్లా ప్రజా పరిషత్‌ ‌సర్వసభ సమావేశాన్ని ఉదయం 10.30 గం లకు ఎంవైఎస్‌ ‌ఫంక్షన్‌హాలులో నిర్వహించేందుకు జిల్లా పరిషత్‌ ‌చైర్మెన్‌ ఆర్‌. ‌లోక్‌నాథ్‌రెడ్డి నిర్ణయించినట్లు జడ్పీ సిఈఓ నర్సింలు ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల జిల్లా పరిషత్‌ ‌గౌరవ సభ్యులు అధికారులు సకాలంలో సభకు హాజరు కావాలని ఆయన కోరారు. అధికారులు వారి శాఖల నివేదికతో హాజరు కావాలని కోరారు.

Tags: Quickly resolve,complaints,District Collector,Shweta Mahanty

Leave a Reply