Take a fresh look at your lifestyle.

గృహ రుణాలపై త్వరగా వన్‌టైమ్‌ ‌సెటిల్‌మెంట్‌

పథకం అమలు కోసం విధి విధానాలపై చర్చ
గృహ నిర్మాణంలో అధికారులతో సక్షించిన సిఎం జగన్‌

అమరావతి,సెప్టెంబర్‌ 20 : ‌గృహనిర్మాణాలకు సంబంధించి వన్‌టౌమ్‌ ‌సెటిల్‌మెంట్‌ ‌త్వరగా చేపట్టాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.  ఏపీ హౌసింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌నుంచి రుణాలు తీసుకున్న వారికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ ‌పథకం వర్తిస్తుంది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేసిన అధికారులు..  పథకం అమలు కోసం రూపొందించిన విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు.

గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహ న్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ ‌కార్యాలయంలో సక్ష నిర్వహించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ ‌స్కీంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. సెప్టెంబరు 25 నుంచి డేటాను ఏపీ హౌసింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ అప్‌లోడ్‌ ‌చేయనుంది. వివిధ సచివాలయాలకు ఈ డేటాను పంపనున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్‌ ‌పథకం సొమ్మను చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌కు అర్హులైన వారి జాబితాలు ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్టేష్రన్లు చేయనున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ ‌స్కీంకు మంచి స్పందన వస్తోందని సీఎంకు అధికారులు తెలిపారు. ఓటీఎస్‌ ‌పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్‌గా ఉండాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. అలాగే పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం సక్ష చేపట్టారు.

ఇప్పటివరకూ గ్రౌండ్‌ అయిన ఇళ్లు 10.31 లక్షలు కాగా…ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. లబ్దిదారులు ఎంచుకున్న ఆప్షన్‌ 3 ‌కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికా రులకు సీఎం ఆదేశించారు.  ఈ ఇళ్ల నిర్మాణ లబ్దిదారులు, మేస్త్రీలతో కలిపి 18వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్లనిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయన్న అధికారులు చెప్పారు. మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలను, ఖర్చులను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.

కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్‌లు సిద్ధంచేశామనని అధికారులు తెలిపారు. కాలనీ ఒక యూనిట్‌గా పనులు అప్పగించా లన్నారు. ఈ సక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌, ‌గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ‌దాస్‌, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ‌ఛైర్మన్‌ ‌దవులూరి దొరబాబు, ల్యాండ్‌ అడ్మినిస్టేష్రన్‌ ‌చీఫ్‌ ‌కమిషనర్‌ ‌నీరబ్‌ ‌కుమార్‌ ‌ప్రసాద్‌,  ‌గృహనిర్మాణశాఖ స్పెషల్‌ ‌సీఎస్‌ అజయ్‌ ‌జైన్‌, ‌రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్‌, ‌గృహనిర్మాణశాఖ స్పెషల్‌ ‌సెక్రటరీ రాహుల్‌ ‌పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎం‌డీ ఎన్‌ ‌భరత్‌ ‌గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply