Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలి : కమీషనర్‌

:అభివృద్ధి పనులలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించాలని వరంగల్‌ ‌నగర పాలక సంస్థ కమిషనర్‌ ‌పమేలా సత్పతి పేర్కొన్నారు. సోమవారం జిడబ్ల్యూఎంసి పరిధిలో బల్దియా ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 47 వ డివిజన్‌ ‌లోని గోపాలపురం, బృందావన్‌ ‌కాలని, అరుణోదయ కాలని, 100 ఫీట్ల రోడ్‌ ‌లహరి కేఫ్‌ ‌వద్ద, దేవరాజు కాలని, ద్వారక సాయికాలని, 51వ డివిజన్‌ ‌లోని చైతన్యపురి, ప్రశాంత్‌ ‌నగర్‌ ‌ప్రాంతాలల్లో నిర్మించిన అంతర్గత సిసి రోడ్లు, బిటి రోడ్లు,  డ్రైనేజీల నాణ్యత, రోడ్‌ ‌వెడల్పు, లోతు పరిశీలించి పలు సూచనలు చేశారు. రోడ్‌లను పరిశీలించి రోడ్ల మధ్య బిటి జాయిం ట్స్ ‌వేయాలని, కార్నర్‌ ‌లలో టర్బ్ ‌వాల్‌, ‌సైడ్‌ ‌బుర్నస్ ‌నిర్మించాలని ఆదేశించారు. 46 డివిజన్లలో ని జవహర్‌ ‌కాలని వాసి కొత్తగా నిర్మించిన డ్రైన్ను విచిన్నం చేయడాన్ని గమ నించిన కమిషనర్‌  అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 10 వేల రూపాయల జరిమానా విధిం చారు.

ఇక ముందు ఇలా ఎవరైనా చేస్తే క్రిమినల్‌ ‌కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ‌మాట్లాడుతూ అభివృద్ధి పనులలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, సరిగా క్యూరింగ్‌ ‌చేయడం లేదని అన్నారు. నిర్దేశాల మేరకు100 శాతం పని జరుగుతేనే కాంట్రాక్టర్లకు చెల్లింపు చేస్తామని లేని పక్షంలో బిల్లులలో తగ్గింపులు తప్పవని తెలిపారు. ఎంబుక్‌ ‌లో  నమోదైన నిర్మాణ వివరాల ప్రకారమే చెల్లింపు జరుగు తుందన్నారు. పనులను ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏ చిన్న అభివృద్ధి పనైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో ఉంటేనే బిల్లులు మంజూరు చేస్తామని అన్నారు. 47 వ డివిజన్‌లోని ఎఫ్‌సిఐకాలనిలో మిషన్‌ ‌భగీరథ ఒహెచ్‌ఎస్‌ఆర్‌ ‌నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి త్వరితగతిన నిర్మించాలని ఆదేశించారు. అనంతరం 47, 51 డివిజన్లలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు సేకరించిన చెత్తా పెరుకు పోకుండా తరలించాలని, మురుగు కాలువలలో చెత్తను తొలగించాలని ఆదేశించారు. వర్షా కాలం దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా పరిశుధ్యాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదే శించారు. కమిషనర్‌ ‌వెంట డిఈ రవి కిరణ్‌, ఏఈ‌శ్రీకాంత్‌, ‌వర్క్ ఇన్సెస్పెక్టర్‌లు రాజు, యుగేం దర్‌,ఎస్‌ఐ ‌గోల్కొండ శ్రీను తదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!