Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్య

అల్లాదుర్గం :  ‘‘రెండున్నర కోట్ల రూపాయలతో చక్కటి జూనియర్ కాలేజీ భవనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం..జూనియర్ కాలేజీలో ఒక్క రూపాయి ఫీజు కూడా లేకుండా పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. మన పిల్లలు ఇంకా బాగా చదవాలి. దీని కోసం కాలేజీ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారితో పాటు ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాలి..అని మంత్రి హరీష్ రావు హిరావు పలికారు. సోమవారం  మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు…మాట్లాడుతూ  “మన ఊరు – మన బడి కార్యక్రమం కింద  రూ.
7300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లలాగా తయారు చేసే కార్యక్రమం ప్రారంభించాం.  పేద పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీషులో చదువుకోవాలి..తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుని కష్టపడుతూ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం చదువు కావాలని పంపుతున్నారు.  ఇప్పుడు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీషులో బోధనలు ప్రారంభిస్తున్నాం..మన ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన చదువు చెప్పడమే కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్‌లతో పాటు అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడే విధంగా ఉన్నాయి..ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో మంచి చదువు చెబుతున్నారు గనుక మీ పిల్లల్ని వాటిలో చేర్పించి మీ ఖర్చులను తగ్గించుకోండి.’’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

- Advertisement -

Leave a Reply