Take a fresh look at your lifestyle.

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

  • కామారెడ్డి జిల్లాలో ఆగివున్న లారీని ఢీకొన్న క్వాలిస్‌
  • ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం
  • గచ్చిబౌలిలో కారు ప్రమాదంలో డ్రైవర్‌, ఇద్దరు ఆర్టిస్టుల మృతి

ప్రజాతంత్ర, కామారెడ్డి/హైదరాబాద్‌ : ‌కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద కొడప్‌గల్‌ ‌జగన్నాధపురం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతోసహా ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. జగన్నాథపురంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని క్వాలిస్‌ ‌ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బిచ్కుంద నుంచి పిట్లంవైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. వెంటనే క్షతగాత్రులను సవి•పంలోని ఏరియా హాస్పాటల్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు హైదరాబాద్‌ ‌వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కారు వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. కారు వేగంగా ఢీకొట్టడంతో ముందుభాగం నుజ్జునుజ్జయింది.

prajatantra national news, telugu regional updates

గచ్చిబౌలిలో కారు ప్రమాదంలో డ్రైవర్‌, ఇద్దరు ఆర్టిస్టుల మృతి
నగరంలోని గచ్చిబౌలీలో ఘోర కారు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు హెచ్‌సీయూ వద్ద అదుపుతప్పి డివైడర్‌ ‌మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్‌ ‌సహా ఇద్దరు మహిళా జూనియర్‌ ఆర్టిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. మృతులను కారు డ్రైవర్‌ అబ్దుల్‌ ‌రహీమ్‌ (‌విజయవాడ), ఎం మానస (మహబూబ్‌నగర్‌), ఎన్‌ ‌మానస (కర్ణాటక)గా గుర్తించారు. అబ్దుల్‌ ‌రహీం బ్యాంక్‌ ఉద్యోగికాగా, మహిళలు ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు. గాయపడిన వ్యక్తి సిద్ధు అలియాస్‌ ‌సాయి సైదులు అని, అతడు కూడా జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడని చెప్పారు. వీరు అవి•ర్‌పేటలోని హాస్టల్‌లో ఉంటున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో జడ్చర్లలోని పాతబజార్‌కు చెందిన ఎం మానస(19) దుర్మరణం చెందిన సంగతి తెలిసి తండ్రి షాక్‌కు గురయ్యాడు.

Leave a Reply