Take a fresh look at your lifestyle.

పీవీ ..ఠీవీ.. ఒక లోపలి కథ .!

“స్వశక్తిపై  ఉన్నత శిఖరాలకు ఎదిగిన తెలంగాణ బిడ్డగా ఆయనను తెరాస గౌరవించాలనుకుంటోంది. తెలుగు వారిలోనే కాదు, దక్షిణాదిన తొలి ప్రధానిగా చరితార్ధులు.  ఏడాది పాటు ఆయన శతజయంత్యుత్సవాలను  తెరాస జరపడం కాంగ్రెస్ ను ఇరుకున పెట్టినట్టే,. కాంగ్రెస్ పార్టీ పీవీని బహిరంగంగా కాదని అనలేదు. మావాడే అని అనలేని పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎలా  గౌరవించింది,ఎలా అవమానించిందీ ఈఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది.   నరసింహారావు ను  కాంగ్రెస్ వారు హిందుత్వ వాదులకు సన్నిహితుడని సానుభూతి పరుడని  విమర్శించేవారు.   గాంధీ నెహ్రూ కుటుంబంపై ధ్వజమెత్తడానికి బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నాయకులకు ఇదో అస్త్రం కానుంది,  పీవీ శతజయంత్యుత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడం వల్ల తెరాసకు  లబ్ధి కలగవచ్చు.”

దేశ రాజకీయ నాయకుల్లో ఎంతో పేరు ప్రతిష్ఠలు, ప్రకాశమానమైన జీవితం గడిపిన పాములపర్తి వెంకట నరసింహారావు జీవితంలో ఎన్ని సమున్నతమైన గౌరవాలను పొందారో అన్ని అవమానాలనూ భరించారు. ఆయన శతజయంత్యుత్సవాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఆయనను సంస్మరించుకునేందుకు ఇదే సమయం.

జూన్ 28వ తేదీ నుంచి (వచ్చే ఆదివారం నుంచి) పీవీ శతజయంత్యుత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్టు తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్) ప్రకటించింది. ఇందుకోసం పది కోట్ల రూపాయిలను మంజూరు చేసింది. పీవీకి భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. నిజానికి పీవీకీ తెరాసకు ఏ మాత్రం సంబంధం లేదు. పీవీ రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉంది. ఆయన కరడుకట్టిన కాంగ్రెస్ వాది. నిబద్ధతకు,అంకితభావానికీ పేరొందిన స్వాతంత్ర్య సమరయోధుల్లో ఆయన ఒకరు. ఆయన సమైక్యవాది. తెలంగాణ కి చెందినవారైనా ఆయన ఎప్పుడూ తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరలేదు. ప్రాంతీయ అసమానతలను తొలగించుకుంటూ తెలుగు జాతి అంతా ఏకతాటిపై నిలబడాలని త్రికరణ శుద్ధిగా విశ్వసించిన వారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు పీవీతో ఎప్పుడూ సన్నిహిత సంబంధాలు లేవు. తెలంగాణ బిడ్డగా పీవీని గౌరవించాలని తెరాస ఈ నిర్ణయం తీసుకుంది.

పీవీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను అలంకరించారు. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి, విదేశాంగ మంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, వంటి ఉన్నత పదవులను నిర్వహించి చివరికి ప్రధానమంత్రిగా ఆయన అత్యున్నత పదవికి చేరుకున్నారు. ఈ పదవులన్నీ ఆయన కోరుకుంటే వచ్చినవి కావు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన విప్లవాత్మకమైన భూసంస్కరణలు తీసుకుని వచ్చారు. ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అలాగే, కేంద్రంలో ఆయన ప్రధానమంత్రి పదవిని అనుకోకుండా చేపట్టాల్సి వచ్చింది . మైనారిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఐదేళ్ళూ నడపించిన రాజకీయ చాణక్యునిగా పేరొందారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కణ లు దేశ ఆర్థిక వ్యవస్థ దిశను మార్చాయి. ఆనాటి రాజకీయవేత్తల్లో ఆయనంతటి ప్రతిభావంతులు, దార్శనికుడు, దూరదృష్టి కలవారూ ఎవరూ లేరు. ఆ విధంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న పీవీ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. పీవీ పట్ల తెలుగు వారికి సమున్నతమైన గౌరవమే కాకుండా, ఆయన పట్ల సానుభూతి కూడా ఉంది.

వామపక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువు, తెలంగాణ భావోద్వాగానికి పుట్టినిల్లు అయిన ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన పీవీ చదువుకునే రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. శాసనసభ్యునిగా సుదీర్ఘ అనుభవం కలిగిన పీవీ ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి , మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలోనూ, కాసు బ్రహ్మానంద రెడ్డి కేబినెట్ లోనూ మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయన అధికంగా ఉన్న భూ కమతాలను వ దులు కునేందుకు మార్గదర్శి అయ్యారు. భూమిలేని నిరుపేదలకూ, వలసదారులకూ భూమిని పునర్ పంపిణీకి మార్గం చూపారు . భూమి పంపిణీ విషయంలో ముందుగా తాను ఆచరించి ఇతరులకు మార్గదర్శకులయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణ యాల్లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాల్లో భూకమతాల పునర్వర్గీకరణ ( ల్యాండ్ సీలింగ్) కారణంగానే ఆయన సంపన్న, పలుకుబడి వర్గాల ఆగ్రహానికి గురి అయ్యారు. పీవీ ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారనే దానిపై రకరకాల వాదాలు ఉన్నాయి. ఆయన పేదవారి కష్టాలను చూసి చలించేవారు. అందువల్ల సహజంగానే పేదవారికి సాయం చేయాలన్న సదుద్దేశ్యంతోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నారని కొందరంటారు. ఆయన సంస్కరణలకు కట్టుబడి ఆ నిర్ణయం తీసుకున్నారని మరికొందరంటారు. అంతేకాక, పార్టీలో ఫ్యూడల్ వర్గాలను రాజకీయంగా బలహీనపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ఈ నిర్ణయం కారణంగానే రాజకీయంగా ఆయన ఎన్నో ఎదురు దెబ్బలను ఎదుర్కోవల్సి వచ్చింది.

కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని సంపన్నులైన భూస్వాములు, తెలంగాణలోని ఫ్యూడల్ భూస్వాములు కుట్రపన్ని ఆయనను పదవి నుంచి దించి వేశారన్నది విశ్లేషకుల అభిప్రాయం. అప్పట్లో వీరంతా శక్తిమంతమైన లాబీగా వ్యవహరించేవారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత పీవీ అతి సామాన్య రాజకీయ నాయకునిగా గడిపారు. పార్టీలో ఆయనకు గ్రూపులు లేవు. లాబీలు లేవు. బలమైన సామాజిక వర్గాల మద్దతు లేదు. కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆయనకు మద్దతు ఇవ్వలేదు. తిరిగి ఫ్యూడల్ వర్గాల చేతుల్లోకి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. రెండు దశాబ్దాల పాటు దీని ప్రభావాన్ని చూసిన ఆయన తన కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మార్చారు ఆయన పదవుల కోసం ఎన్నడూ అర్రులు చాచలేదు. పదవుల కోసం పైరవీలు చేయలేదు. పార్టీ అధిష్ఠానానికి విధేయునిగా పార్టీ నాయకత్వం ఏ పదవి ఇస్తే దానితోనే సంతృప్తి పొందారు., అఖిలభారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. దాంతో రాష్ట్రానికీ,ఆయనకూ మధ్య దూరం పెరిగింది. తాను పుట్టి పెరిగిన ప్రాంతంతో కూడా దూరం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు సార్లు పార్లమెంటుకు ఆయన ఎన్నికైనా, పార్టీలో అంతః కలహాల వల్ల మూడోసారి ఓడిపోయారు. దాంతో ఆయన మహారాష్ట్ర లోని రామ్ టెక్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పార్టీ నాయకుల్లో కొందరు ఆయన నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయాలని చూశారని పీవీ సన్నిహితులనేవారు.ఆయనకు అన్ని చోట్లా అభిమానులు ఉన్నారు. ముఖ్యమంత్రిగా నరసింహారావును మరిచిపోయేట్టు చేయడం కోసమే చేశారని అంటారు.

అయితే, కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆయనను అభిమానించింది. ఆయన 14 భాషల్లో పండితుడు. తెలుగంటే ఆయనకు పంచప్రాణాలు. తియ్యని తెలుగుకు ఆయన ప్రసంగం సంకేతం. ఎంత సేపు విన్నా వినాలని అనిపించేది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆయనలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. ఆమె ప్రసంగాలను పీవీయే రూపొందించేవారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) సమావేశాల్లో తీర్మానాలను ఆయనే రూపొందించేవారు. పార్టీ విధానాలపైనా, సిద్ధాంతాలపైనా అకుంఠిత విశ్వాసం, సాధికారత ఆయనకు ఉండేది. ఆయనకు మాజీ ప్రధాని రాజీవ్ గాందీతో కూడా సత్సంబంధాలు ఉండేవి. రాజీవ్ హత్యానంతరం అనుకోకుండా ప్రధానమంత్రి పదవి వచ్చి పీవీని వరించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధవంతంగా ఐదేళ్ళు నడిపారు. 1990లో ఆయన అమెరికా వెళ్ళారు.ఆయన కుమార్తె అక్కడ ఉండేవారు. అప్పట్లో నేను ఉన్నత చదువుల కోసం అక్కడే ఉండేవాడిని అని ఆయన మనవడు ఎన్ వి సుభాష్ గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధిగా ఉంటున్నారు.

బైపాస్ సర్జరీకి ముందు ఆయనను కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని ముచ్చటించారు. ప్రధానమంత్రి అయితే ఏం చేసేవారని మాలో ఒకరం ప్రశ్నించాం. ఇది చాలా సాదాసీదా వేసిన ప్రశ్న,. దేశాన్ని మార్చేస్తాను. పెట్టుబడులను రాబడతాను, పరిశ్రమలు వచ్చేట్టు చేస్తాను అని సమాధానమిచ్చారు. అప్పట్లో మాకు ఏం తెలియక నవ్వేశాం. ఆయన మాటల అంతరార్థం ఇప్పుడు తెలుసుకున్నాం. అని సుభాష్ అన్నారు. తన తాతగారు డబ్బు కోసం ఏనాడూ వెంపర్లాడలేదనీ, ఆయనకు అయిన బైపాస్ సర్జరీ ఖర్చును కూడా కుటుంబ సభ్యులు, అభిమానులు భరించారని సుభాష్ చెప్పారు.

ఆయన ఎన్నో విమర్శలూ, ఆరోపణలూ ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ హత్య జరిగిన సమయంలో ఆయన కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఢిల్లీలో అల్లర్లు జరిగాయి. వాటిని నిరోధించడంలో పీవీ విఫలమయ్యారన్న ఆరోపణలు వ చ్చాయి. అదే సంవత్సరం (1984లో) ఆయనను భోపాల్ గ్యాస్ ఘటన కేసులో యూనియన్ కార్బౌడ్ సీఈఓ వారన్ ఆండర్సన్ దేశం విడిచి పారిపోయిన సంఘటనపై ప్రశ్నించారు. అలాగే, బాబ్రి మసీదు కూల్చినవేత , మత ఘర్షణల నివార ణలో ఆయన విఫలమయ్యారన్న ఆరోపణలు వ చ్చాయి. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది పీవీయే,. ఆయనను ఆర్థిక సంస్కరణల పితామహునిగా కీర్తిస్తారు. అణ్వాయుధ సామర్ధ్యాన్ని పెంచే కార్యక్రమానికి ఊతం ఇచ్చారు. ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత సోనియాగాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలయ్యారు. పదవినుంచి దిగిన తర్వాత అవినీతి ఆరోపణల కేసుల్లో పార్టీ ఆయనకు బాసటగా నిలవలేదు.ఆయన స్వయంగా ఆ కేసులను ఎదుర్కొన్నారు. 2000 లో ఆయన కాలధర్మం చెందడానికి ముందు హైదరాబాద్ వ చ్చారు. అప్పుడు కూడా కొద్ది మంది పార్టీ నాయకులే ఆయనను రహస్యంగా కలుసుకునే వారు. బహిరంగంగా కలుసుకుంటే హైకమాండ్ కు ఎక్కడ ఆగ్రహం వ స్తుందోనని భయపడేవారు.

రాహుల్ దేవులపల్లి,’ది వీక్ ‘ సౌజన్యం తో ..

Leave a Reply