Take a fresh look at your lifestyle.

టోక్యో ఒలంపిక్స్‌కు వెళుతున్న పివి సింధు

క్రీడాకారులకు సిఎం జగన్‌ అభినందనలు
అమరావతి,జూన్‌ 30 :‌టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ ‌క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 23 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ ‌రాజధాని టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న క్రీడా ••రులు పీవీ సింధు, ఆర్‌ ‌సాత్విక్‌ ‌సాయిరాజ్‌, ‌రజనీలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను సీఎం జగన్‌ అం‌దజేశారు.

విశాఖపట్నంలో బ్యాడ్మింటన్‌ అకాడ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను సీఎం జగన్‌ ‌పీవీ సింధుకి అందించారు. అదే విధంగా రజనీ (ఉమెన్స్ ‌హకీ) బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ రామ్‌గోపాల్‌, ‌శాప్‌ ఉద్యోగులు వెంకట రమణ, జూన్‌ ‌గ్యాలియో, రామకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply