Take a fresh look at your lifestyle.

సిఎం జగన్‌తో పివి సింధు భేటీ

  • విశాఖ అకాడని ప్రారంభించాలని సూచన
  • క్రీడాకారులకు ఎపి సర్కార్‌ ‌ప్రోత్సాహంపై సింధు ఆనందం

అమరావతి, ఆగస్ట్ 6 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డిని ఒలింపిక్స్ ‌కాంస్యం సాధించిన విజేత పివి.సింధు శుక్రవారం కలిశారు. సింధును సిఎం జగన్‌ అభినందించి సత్కరించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందజేశారు. విశాఖలో వెంటనే అకాడని ప్రారంభించాలని, రాష్ట్రం నుంచి మరింతమంది సింధులు తయారు కావాలని సిఎం జగన్‌ ఆకాంక్షించారు. అనంతరం సచివాలయ ఆవరణలో పివి సింధు డియాతో మాట్లాడుతూ… సిఎం వైఎస్‌ ‌జగన్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సిఎం జగన్‌ ఆశీర్వదించారని, ఒలింపిక్స్‌లో మెడల్‌ ‌తీసుకురావాలని కోరారని తెలిపారు. ఉద్యోగాల్లో స్పోర్టస్‌కు 2 శాతం రిజర్వేషన్‌ ‌గొప్ప విషయం అని చెప్పారు. అకాడ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని.. త్వరలోనే అకాడ ప్రారంభిస్తానని పివి సింధు పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రపదేశ్‌ ‌ప్రభుత్వం పలు పథకాలను అమలు చేయడం ఎంతో అభినందనీయమని పి.వి.సిందు అన్నారు.

శుక్రవారం సెక్రటేరియెట్‌ ‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.‌జగన్మోహన్‌ ‌రెడ్డిని మర్యాధపూర్వకంగా కలిసిన అనంతరం పాత్రికేయులతో ఆమె కొంతసేపు ముచ్చటించారు. టోక్యో ఒలంపిక్స్ ‌కి వెళ్లే ముందు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసానని, ఒలంపిక్స్ ‌లో పథకాన్ని సాదించిరావాలని ప్రోత్సహించారన్నారు. వారి ప్రోత్సహించినట్లే టోక్యో ఒలంపిక్స్ ‌లో కాంస్య పథకాన్ని సాదించినందుకు ముఖ్యమంత్రి తనను ఎంతోగానో అభినందిం చారని, భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాదించి రాష్టాన్రికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్‌ ‌ను అమలు పరుస్తున్నారని, ఇటు వంటి విధానం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ ‌పురస్కారాలను అందజేయడం కూడా ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు. పాత్రికేయులు అడిగి ప్రశ్నకు ఆమె సమాధానం చెపుతూ త్వరలోనే క్రీడా అకాడని కూడా ప్రారంభించనట్లు ఆమె తెలిపారు. సాంస్క•తిక ,యువజన శాఖ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ డా.రజత్‌ ‌భార్గవ్‌ ఈ ‌సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply