Take a fresh look at your lifestyle.

కాంస్య కాంతులు విరజిమ్మిన ‘సింధూ’రం

ఒలింపిక్స్‌లో వరుసగా రెండ పతకం సాధించిన ఘనత పీ.వీ సింధూకే..
చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఒలింపిక్స్‌లో భారత వనిత, తెలుగు తేజం అయిన పూసర్ల వెంకటసింధు(పీ.వి. సింధూ) చరిత్ర సృష్టించిన షట్లర్‌గా ఘనత కెక్కింది. మునుపెన్నడూ లేని విధంగా వరుసగా రెండు సార్లు నిర్వహించిన ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించి భారత దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పింది. మన తెలుగు బిడ్డ జపాన్‌ ‌గడ్డపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. కొద్ది తేడాతో ఒలింపిక్స్‌లో పసిడి పతకం చేజారిన కాంస్య పతకంలో కాంతులు విరజిమ్మిన సింధూ ప్రతిభ అమోఘం, అద్భుతం.

ప్రస్తుతం జపాన్‌ ‌దేశంలోని టోక్యోలో నిర్వహిస్తున్న ఒలింపిక్‌ ‌క్రీడల్లో భారతదేశం తరుపున యువ కిశోరం, నయయువ షట్లర్‌ ‌పీవీ. సింధూ పాల్గొన్న విషయం విధితమే. వరుసగా ప్రత్యర్థులను తన చేతివాటంతో చిత్తుచేసిన సింధూ సెమిఫైనల్‌లో కాస్తతడబడింది. కారణం ప్రపంచ షటిల్‌ ‌ఛాంపియన్‌ ‌షిప్‌లో మొదటి ఛాంపియన్‌ ‌నిలిచిన చైనా క్రీడాకారిణి యువ షట్లర్‌ ‌తైజూయింగ్‌తో సింధూ మెదటి గేమ్‌లో నువ్వా?నేనా? అనే రీతిలో పోరుసాగిన కొద్ది పాయింట్ల తేడాతో తైజూ విజయం సాధించింది. రెండో గేమ్‌లో తైజూయింగ్‌ ఆటలో పూర్తి పట్టు సాధించడంతో సెమిస్‌లో పోరాడి ఓడిన క్రీడాకారిణిగా రికార్డు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మరో చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై ఘన విజయం సాధించి కాంస్య పతకం చేజిక్కించుకుంది. దీంతో యావత్‌ ‌భారత దేశాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తి కాంస్య విజేతగా నిలిచింది.

టోక్యో వేదికపై భారత యువతి విజయం మనందరికి గర్వకారణం. గత ఒలింపిక్స్ ‌రియోలో జరిగాయి. రియోలో జరిగిన క్రీడల్లో రజతం సాధించి ఔరా అనిపిందించి. గ్లాస్గొలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్లో ఒడినా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అప్పట్లో ఛాంపియన్‌షిప్‌తో పాటు స్వర్ణ పతకం టైటిల్‌ ‌తృటిలో చేజార్చుకుంది. అదే మాదిరి ప్రస్తుతం జరిగిన క్రీడాపోటీల్లో కూడా సింధూను పరాజయం వైపు నడిపింది. కాగా తైజూ తప్ప వేరేవరైనా బరిలో ఉంటే ఉంటే సింధూ కుఅవకాశం ఉండేదని, ఎలాగు ఫైనల్‌లో గత ఒలింపిక్స్ ‌మాదిరిగా కాకుండా నైపుణ్యత ప్రదర్శించి స్వర్ణం వైపు అడుగులు పడేవని క్రీడాభిమానుల వారి అభిప్రాయాలను వెల్లడించారు. 2017 సెప్టెంబర్‌ 21‌న జపాన్‌ ఒపెన్‌ ‌సిరీస్‌ ‌ఫ్రీక్వార్టర్‌ ‌సింధూ ఓటమి చవిచూసినా, ప్రపంచ బ్యాడ్మింటన్‌ ‌ర్యాంకింగ్‌లో రెండవ స్థానాన్ని నిలబెట్టుకుంది.

క్రీడల్లో గెలుపోటములు సహజం ఓటమి బాధించినా, తిరిగి విజయం వైపు అడుగులు వేయడం క్రీడాకారులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం, లక్ష్యం, ఆ లక్ష్యంతోనే బింగ్జియావోపై విజయం సాధించేలా చేసింది అనడంలో సందేహం లేదు. ఓ టమికి గల కారణాలను కనుగొని విజయాలకు బాటలు పరుచుకోవడమే ఉత్తమ క్రీడాకారుల లక్షణం. ఆదిశగా ఆదివారం జరిగిన ఆటలో తనను తాను మలచుకుని అరుదైన షాట్లతో ప్రేక్షకులను మెప్పిస్తూ తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన తీరు ఎంతో మంది యువ షట్లర్లకు ఆదర్శంగా నిలిచింది. ఒకింత అదృష్టం కలిసి రాకపోవడంతో తృటిలో భారత్‌ ‌స్వర్ణపతాకాన్ని చేజార్చుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కామన్‌వెల్త్ ‌క్రీడల్లో 2018లో మిక్స్‌డ్‌ ‌టీం స్వర్నం చేజిక్కిచ్చుకోగా, 2017లో రజతం సాధించారు. ప్రపంచఛాంపియన్‌షిప్‌లో 2019లో స్వర్ణం, 2018లో రజతం, 2017లో రజతం, 2014, 2013లో కాంస్యం పతకాలు సాధించారు. 2017 చైనా ఓపెన్‌, ఇం‌డియా ఓపెన్‌లలో సింధూ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా ప్రపంచ మొదటి ఛాంపియన్‌ ‌తైజూయింగ్‌పై ఆడిన ఆటల్లో ఇంగ్లాండ్‌, ‌మలేషియా, సింగపూర్‌ ‌టైటిల్లు సాధించింది.

గత ఒలింపిక్స్‌లో రజతం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒక రజతం, రెండు కాంస్యాలు లభించాయి. ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌, ‌కామన్‌వెల్త్ ‌క్రీడల్లో మూడు కాంస్యాలు, సూపర్‌సిరీస్‌ ‌టైటిళ్లు గెలుచుకుంది సి ంధూ. విశ్వ క్రీడల్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా కూడా పీవీ. సింధూ. భారత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్‌గా రాణించి క్రీడాకారిణి సుపరిచితురాలు అయింది. సామాన్య క్రీడాకారణిగా అరంగేట్రం చేసి ఆమె నేడు ప్రపంచస్థాయి దృష్టిని ఆకర్షించేలా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించడం ఆమె నైజం. భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయడానికి ఆమె శ్రమించిన తీరు అజరామం. ఇలా వర్ణించుకుంటే పోతే వర్ణనకు సరిపోని పదాలు సింధూ సొంతమనడంలో అతిశయోక్తి కాదు. అసామాన్య రీతిలో కష్టపడి సామాన్య క్రీడాకారిణివలె ఉండడం ఆమెకు సొంతం.

షటిల్‌ ‌బాడ్మింటన్‌లో ఉన్న అన్ని ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొని పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ భారతీయ మహిళా కెరటం తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు వారికి గర్వకారణం. ఈ అభినవ క్రీడాకారిణి కోట్లాది మంది భారతీయుల్ని ఊరిస్తున్న అంశం ఒకటే .. అదేమిటి అంటారా.. బాడ్మింటర్‌ ‌రంగలో ప్రపంచ నంబర్‌వన్‌గా చూడాలని ఆకాంక్ష. ఆమె ఎప్పుడు నంబర్‌వన్‌ ‌ర్యాంకర్‌ (‌షట్లర్‌) ‌రావాలని ఆశాభావాన్ని సైతం వ్యక్తపరచడం గమనార్ఞం. భవిష్యత్తులో పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో తైజూయింగ్‌పై ప్రతీకారం తీర్చుకుని ప్రపంచస్థాయిలో నెంబర్‌వన్‌ ‌ర్యాంకర్‌గా నిలుస్తుందని ఆశిస్తున్న క్రీడాభిమానులు..
సేకరణ: భర్తపురం వెంకటమల్లేష్‌ 9949872371

Leave a Reply