Take a fresh look at your lifestyle.

మరణానంతర  భారతరత్న పివికి ఇవ్వాలి  

*భారతదేశ ఆధునిక నిర్మాత..పండిట్‌ ‌నెహ్రూ తరవాత అంతటి మహానేత
*పార్లమెంటులో పివి విగ్రహం ఏర్పాటు చేయాలి
* గ్లోబల్‌ ‌లీడర్‌ అం‌టూ కితాబు
*అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించిన సిఎం కెసిఆర్‌

‌భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత దేశాన్ని అగ్రదేశాల సరసన నిలబెట్టిన గ్లోబల్‌ ‌లీడర్‌ ‌పివి అని, శతజయంతి ఉత్సవాలు జరుపు కుంటున్న ఈ వేళ మరణనానంతరం పివికి భారతరత్న ఇవ్వాంటూ కెసిఆర్‌ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ పివి సమున్నత నేతగానే కాక బహుముఖ ప్రజ్ఞశాలి అని కొనియాడారు. మంగళవారం రెండో రోజు వర్షాకాల శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే పివి గురించి మాట్లాడుతూ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పీవీ శతజయంతి ఉత్సవాలపై సభలో చర్చించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని కొనియాడారు. దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టడమే గాకుండా భారత ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తి చేయించారని అన్నారు. అనేక రంగాల్లో భారత్‌ను ప్రపంచ దేశాలతో పోటీపడే లా చేశారని అన్నారు. ఆర్థికరంగంలో ఆయన సంస్కరణల కారణంగా నేడు భారత దేశం తలెత్తుకునేలా చేశారని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ మన ఠీవి అని ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేద న్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

Leave a Reply