భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలతోనే ఇవాళ భారతదేశం మనుగడ సాగిస్తోందని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆయన దూరదృష్టి ఉన్న నేత అని కొనియాడారు. పివి 16వ వర్థంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి తదితరులు నివాళులర్పించారు.
పివి సంస్కరణల కారణంగానే ఇవాళ దేశం ఆర్థికంగా ముందుకు సాగుతోందని పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పాలనా కాలంలో ఆర్థికరంగం పరుగులు పెట్టిందన్నారు. పివిని స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు. పివి సంస్కరణలతో దేశ గతి మారిందని మాజీమంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి అన్నారు. ఆయన దేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ అన్నారు. ఆయన మనందరికీ గర్వకారణమన్నారు.