Take a fresh look at your lifestyle.

రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు వెంటనే చేపట్టాలి: హరీష్ రావు

వంటిమామిడి మార్కెట్ యార్డు ఆకస్మికంగా పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

రైతులను ఇబ్బంది పెట్టకుండా యార్డులో కూరగాయల కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలోని వంటి మామిడి మార్కెట్ యార్డును శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించి యార్డులో రైతులతో కాసేపు ముచ్చటించారు. కరోనా వ్యాధి నివారణకు తప్పని సరిగా ముఖానికి మాస్కులు ధరించి, శానిటైజర్ లేదా సబ్బుతో అప్పుడప్పుడు చేతులు కడుక్కోవాలని రైతులకు సూచించారు.

- Advertisement -

జిల్లాలోని రైతులకు రవాణాకు, ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తాజా కూరగాయలను కాపాడుకుంటున్నట్లుగానే ప్రత్యేక శ్రద్ధ వహించి కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని రైతులను కోరారు. అలాగే రైతులకు కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

Leave a Reply