మెదక్ ఏప్రిల్ 25 ( ప్రజాతం త్ర ప్రతినిధి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారులు రైతులకు సంబం ధించిన ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకా రం ఉందా లేదా అనే విష యాలను నిర్ధారణ చేసుకున్న తర్వాతే రైతులకు టోకెన్ లను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూ చించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు కై ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పంటలను కొనుగోలు చేయాలన్నారు. ఇందుకుగాను ప్రతి కేంద్రంలో టోకెన్లు జారీ చేసేందుకు ముందే సంబంధిత రైతుల ధాన్యం ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యానికి మాత్రమే టోకెన్లు జారీ చేయాలన్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పంపకుండా తీసుకోవాలన్నారు.
అలాగే దిగుమతి చేసుకొని రైస్ మిల్ వద్దకు అధికారులు వెళ్లి ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం ఉందా అనే అంశాలను పరిశీలన చేయాలన్నారు. సరైన ప్రమాణాలు లేవనే సాకుతో దాన్యం దిగుమతి చేసుకోకుండా ఉండే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నిజంగానే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ధాన్యాన్ని కొనుగోలు చేసే నిర్వాహకులపై సైతం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ఇన్చార్జిలుగా కేటాయించిన వారు ఆయా కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉండి నిరంతర పర్యవేక్షణ చేసేలా జిల్లాస్థాయి కమిటీ చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోకుండా ఉండేందుకు గాను ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్ల తో మాట్లాడి తరలింపు లను పర్యవేక్షణ చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను అదేరోజు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. ఇప్పటికీ కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి నమోదు చాలా వరకు పెండింగ్ లో ఉందని తక్షణం పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, వ్యవసాయ శాఖ అధికారి పరశురాం, డి సి ఎస్ ఓ శ్రీనివాస్, డి సి ఓ శంకర్, ఏపీ డి ఉమాదేవి, పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి, మార్కెటింగ్ శాఖ ఏడి రమ్య తో పాటు ఇతరులు పాల్గొన్నారు.