Take a fresh look at your lifestyle.

‌గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు

రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధుల జమ

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌05: ‌తెలంగాణ రాష్ట్రంలో వ్యసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. కే. చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం  రైతాంగం సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు అనేక పథకాలను ప్రకటించింది. దుక్కి దున్నింది మొదలు పంట కొనుగోలుదాక అన్ని దశల్లో రైతులకు సహాయం అందిస్తున్నది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కనీస మద్దతు ధరతో వారు పండించిన ధాన్యాన్ని ఐ.కె.పి, ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, డి.సి.ఎం.ఎస్‌, ‌జి.సి.సి, హకాల ద్వారా గ్రామాలలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారి నుండి ప్రతేక్ష్యంగా కొనుగోలు చేస్తున్నది.   ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల ఖాతాలకు నేరుగా నిధులను జమ చేస్తున్నది.

ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్‌ ‌షీట్లు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నది. రైతులకు టోకెన్లు జారీ చేసి కొనుగోలు చేస్తున్నది. సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేసుకొని ధాన్యాన్ని సేకరిస్తున్నది.రైతులు, పేదల సంక్షేమం కోసం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ పేదలకు రేషన్‌ ‌బియ్యాన్ని పంపిణి చేస్తున్నది. రైతుల ప్రయోజనాలనే ముఖ్యమని భావిస్తూ ఇందుకోసం ఆర్ధిక భారం ఎంతైనా సరే అని రైతులకు చేరువలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే. భారత దేశం లో తెలంగాణ రాష్ట్రం మినహా ఏ  రాష్ట్రం కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవింఛాక  2014-2015 నుండి 2021-2022 వరకు రూపాయలు 1,07,777 కోట్లతో 6 కోట్ల 6  లక్షల  మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఎనమిది ఏండ్లలో ప్రభుత్వ చర్యలతో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరగడం తో పాటు రైతుల ఆదాయం పెరిగింది.

గత ఏడాది వానాకాలం, యాసంగి రెండు సీజన్లు కలిపి ఒక్క కోటి ఇరవై లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసింది. ఈ వానాకాలం సీజన్‌ ‌కి  సంబంధిచి 65 లక్షల ఎకరాలలో వరి పంట వేయగా 1 కోటి 51 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేసి ఒకకోటి మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇప్పటి వరకు ఈ సీజన్లో 6,787 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 6,892 కోట్ల విలువగల 33.47 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఏడాది 2014 -2015  లో 24 .30  లక్షల మెట్రిక్‌ ‌టన్నులు, 2015 -2016  లో 23 .57  లక్షల మెట్రిక్‌ ‌టన్నులు 2016 -2017  లో 53 .84  మెట్రిక్‌ ‌లక్షల టన్నులు, 2017  -2018  లో 54 .08  లక్షల మెట్రిక్‌ ‌టన్నులు, 2018 -2019   లో  77 .49  లక్షల మెట్రిక్‌ ‌టన్నులు 2019 -2020   లో 1 కోటి 11  లక్షల మెట్రిక్‌ ‌టన్నులు,  2020 -2021   లో 1 కోటి 41    లక్షల మెట్రిక్‌ ‌టన్నులు, 2021 -2022   లో 1 కోటి 20    లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక రూపాయికి కిలో చొప్పున ఒక్క వ్యక్తికి నెలకు ఆరు కేజీల రేషన్‌ ‌బియ్యం, ఆ కుటుంభం లోని వ్యక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా పంపిణి చేస్తుంది. తెలంగాణాలో మొత్తం 90 .01  లక్షల కార్డులతో 2 కోట్ల 83  లక్షల 42  వేల మందికి రేషన్‌ అం‌దుతున్నది.  ఇందులో 54 .37 లక్షల కార్డుల రేషన్‌ ‌కేంద్ర అందిస్తుండగా  35 .64  లక్షల రేషన్‌ ‌కార్డుల సబ్సిడీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు  మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా జనవరి 2015 నుండి సన్న బియ్యాన్ని పంపిణి చేస్తున్నది. 28,636  పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 25 .10  లక్షల విద్యార్థులు , 4237  సంక్షేమ హాస్టళ్లు, సంస్థలకు చెందిన 9.65  లక్షల మంది విద్యార్థులు అబ్ధిపొందుతున్నారు. 35,700  అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి 10.82  లక్షల లబ్ది దారులకు ఫోర్టిఫీడ్‌ ‌రైస్‌ ‌సరఫరా.

కోవిడ్‌ ‌తీవ్రంగా ఉన్న సమయంలో మే 2021  నుండి మార్చి  2022  వరకు ప్రతి వ్యక్తికి 10  కేజీల చొప్పున ఉచితంగా బియ్యాన్ని 11  నెలల పాటూ ఇవ్వడం జరిగింది. దీనికై 421  కోట్లు ఖర్చు అయ్యాయి. గుర్తింపు పొందిన ప్రైవేట్‌ ‌పాఠశాలకు సంబంధించి 2,03 ,473  మంది టీచింగ్‌ ‌మరియు నాన్‌ ‌టీచింగ్‌  ‌సిబ్బంధికి ఏప్రిల్‌ 2021  ‌నుండి జూన్‌ 2021  ‌వరకు ప్రతి వ్యక్తికి 25  కేజీల సన్న బియ్యాన్ని పంపిణి చేసింది. దీని కోసం 52 .26  కోట్లు ఖర్చు అయింది.కోవిడ్‌ – 19  ‌సమయంలో ఫుడ్‌ ‌సెక్యూరిటీ కార్డు హోల్డర్లకు వన్‌ ‌టైం సప్పోర్టుగా రూపాయలు 15  వందలను ఒకొక్కరికి ఏప్రిల్‌ 2020 , ‌మే 2020  లో ఇవ్వడమైనది. దీనికోసం 24 .54  కోట్లు ఖర్చయింది.
కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయడమైనది.

Leave a Reply