Take a fresh look at your lifestyle.

70 ‌వేల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు..

మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌ ‌పర్యటన  
ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 70 వేల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 91 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసినట్లు చెప్పారు. లేబర్‌ ‌కొరత లేకుండా చూసుకోవాల్సిందిగా రైస్‌ ‌మిల్లుల అధ్యక్షులు చందపాల్‌కు మంత్రి సూచించారు. లారీలు తమకు కేటాయించిన పాయింట్‌ ‌కు ధాన్యం తరలించకుండా ఇతర మార్గాలు అన్వేషిస్తే అట్టి వాటిని సీజ్‌ ‌చేయాలన్నారు. అనంతరం నాలుగు మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలు, డంప్‌ ‌యార్డులు, సవి•కృత వెజ్‌, ‌నాన్‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌నిర్మాణ పనుల ప్రగతి, తూప్రాన్‌లో రోడ్‌ ‌వెడల్పుకు స్థలాల అప్పగింత తదితర అంశాలపై సంబంధిత కమిషనర్లతో మంత్రి సవి•క్షించారు. అనంతరం మార్కెట్‌ ‌కమిట్‌ ‌వద్ద నిర్మించిన షాపింగ్‌ ‌కాంప్లెక్స్ ‌ను మంత్రి ప్రారంబించారు. మెదక్‌, ‌హవేలీ ఘనపూర్‌ ‌లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారాక్‌ ‌చెక్కులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్‌ ‌దేవేందర్‌ ‌రెడ్డి, గ్రంధాలయ చైర్మన్‌ ‌చంద్ర గౌడ్‌, ఒం‌టేరు ప్రతాప్‌ ‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌రమేష్‌, ‌జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మెదక్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ ఆవరణలో దుకాణాల సముదాయాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. కొరోనా నేపథ్యంలో బీహార్‌ ‌కూలీలు వెళ్లిపోవడంతో హమాలీల సమస్య ఏర్పడిందని మంత్రి హరీష్‌రావు చెప్పారు. ప్రైవేటు ట్రాక్టర్లతోనూ ధాన్యాన్ని రైస్‌ ‌మిల్లర్లకు చేరవేసేందుకు ఆదేశాలిచ్చామన్నారు.

ధాన్యాన్ని కళ్ళా ల్లో ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి
మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌ ‌పర్యటనలో భాగంగా మెదక్‌ ‌మండలం రాజు పల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ ‌రెడ్డి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.రైతుబంధు పడుతుందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, వడ్లు ఎన్ని రోజులు ఎండ పెడుతున్నారు,అనే వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నష్టం కలగకుండా ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలనికొనుగోలు కేంద్రాల్లో హమాలిలా కొరత, లారీల కొరత ఉందని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు…స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు లారీల కొరత ఉందని ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని రైస్‌ ‌మిల్‌ ‌ల కు తరలించాలని కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలిలే నేరుగా రైస్‌ ‌మిల్‌ ‌లలో ధాన్యాన్ని దించాలని అప్పటికప్పుడే వారికి దానికి సంబంధించిన చార్జీలు చెల్లించడం జరుగుతుందన్నారు… రైతులు దలారులను నమ్మి మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని రైతులకు సూచించారు..ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్‌ ‌దేవేందర్‌ ‌రెడ్డి జెడ్పి వైస్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌లావణ్య రెడ్డి తదితరులు ఉన్నారు…

Leave a Reply